తెలంగాణ

ఎక్సైజ్‌శాఖలో భారీగా బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: తెలంగాణ ఆబ్కారీ శాఖలో భారీగా బదిలీలు అయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ను అరికట్టడమే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనకు సిద్ధమైంది. ఎక్సైజ్‌లో పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో బదిలీలపై అకున్ సబర్వాల్ ప్రస్తావించారు. ఈ క్రమంలో 23 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 196 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీకి రంగం సిద్ధం చేసింది. ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న అధికారుల బదిలీలకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా నేటి సాయంత్రం లోపు బదిలీ అయిన అధికారులందరికీ ఉత్తర్వులు అందజేయనున్నట్టు సమాచారం.