రాష్ట్రీయం

పరవళ్లు తొక్కుతున్న గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 18: గత మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది పరవళ్ళు తొక్కుతోంది. ఎగువ భాగాన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మంగళవారం 20 అడుగులకు చేరింది. ఉప నదులైన తాలిపేరు, పెన్‌గంగ, ఇంద్రావతి నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గోదావరి నది నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది. తాలిపేరు ప్రాజెక్టు నిండటంతో 15గేట్లు ఎత్తి 75వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని వాజేడు మండలంలోని బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పర్యాటకులను అనుమతించడం లేదు. మరోవైపు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని వైరా రిజర్వాయర్ నీటిమట్టం 13అడుగులకు చేరుకోగా పాలేరు నీటిమట్టం 18.7 అడుగులకు చేరిం ది. మరో మూడడుగులు చేరితే వైరా, నాలుగు అడుగులు చేరితే పాలేరు రిజర్వాయర్‌లు పూర్తిగా నిండుతాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో రెండుగేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. కినె్నరసాని జలాశయానికి భారీగా నీరు వచ్చి చేరుతోంది. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని బయ్యారం పెద్ద చెరువు పూర్తిగా నిండింది. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని పాకాల రిజర్వాయర్ పూర్తిగా నిండి అలుగు పడటంతో మునే్నరులో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మరో రెండురోజుల పాటు ఇదే రీతిలో వర్షాలు ఉంటే ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ముందస్తు చర్యగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రధాన రిజర్వాయర్‌లు నిండటంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని చలివాగు, మసివాగు, రాళ్ళవాగు, ముర్రేడు, ఆకేరులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాల్లో చెరువులు పూర్తిగా నిండి అలుగులు పడ్డాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మంగళవారం మూడు సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం కూడా వర్షాలు పడే అవకాశం ఉంద ని అధికారులు చెబుతున్నారు.

చిత్రం.. తాలిపేరు గేట్లు ఎత్తి నీరు వదులుతున్న దృశ్యం