తెలంగాణ

ఫీజుల దోపిడీ అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి సంఘాల ఐక్యా కార్యాచరణ కమిటీ శుక్రవారం నాడు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, పిడిఎస్‌యు, టివివి, టిఎస్‌ఎఫ్, ఎఐఎఫ్‌డిఎస్, పిడిఎస్‌యు, ఎఐఎస్‌బి, ఎఐపిఎస్‌యు, బిసివిఎస్, డిఎస్‌యు తదితర సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ పిలుపునకు తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్, డివైఎఫ్‌ఐ తదితర విద్యార్ధి సంఘాలు కూడా మద్దతు పలికాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తి వైఫల్యం చెందింది. విద్యార్థుల సమస్యలపై ప్రజాస్వామ్య యుతంగా బంద్‌కు పిలుపునిస్తే ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తోందని జిల్లాల్లో విద్యాసంస్థల యాజమాన్యాలను బెదిరిస్తూ జరగకుండా అడ్డుకుంటోందని నేతలు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో విద్యార్థి సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టులు చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని సమస్యలను పరిష్కరించకపోగా ప్రభుత్వం నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయాలని చూస్తోందని వారు చెప్పారు. ఎంత నిర్బంధం చేసినా, ఆటంకాలు కలుగజేసినా బంద్ విజయవంతం చేస్తామని తెలిపారు. ఫీజుల నియంత్రణ చట్టం చేస్తామని చెప్పి దానికో కమిటీ వేసి కాలయాపన చేస్తోందని , ఏ రాష్ట్రంలో లేనన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు తెలంగాణలో ఉన్నాయని, ఫీజుల దోపిడీని విచ్చలవిడిగా కొనసాగుతున్నా కనీసం చర్యలు లేవని అన్నారు. గత మూడేళ్లుగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వేల కోట్ల రూపాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.