తెలంగాణ

నిరుద్యోగ బ్రాహ్మణ యువతకు హెల్త్ రంగంలో ఉచిత శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్-అపోలో మెడ్‌స్కిల్స్ సంయుక్తంగా బ్రాహ్మణ యువతకు (18-25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు) వైద్య ఆరోగ్య రంగంలో నైపుణాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాయి. పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్, అడ్వాన్స్‌డ్ సర్ట్ఫికెట్ కోర్స్ ఇన్ డయాలిసిస్‌లలో శిక్షణ ఇస్తారు. యువత అర్హతను అనుసరించి ఈ కోర్సులకు ఎంపిక చేస్తారు. బ్రాహ్మణ యువతకు ఇదో మంచి అవకాశమని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కె.వి. రమణాచారి తెలిపారు. నిరుద్యోగ బ్రాహ్మణ యువతకు హెల్త్‌కేర్ రంగంలో శిక్షణ ఇవ్వడం ఆనందంగా ఉందని అపోలో మెడ్‌స్కిల్స్ సిఇఓ డాక్టర్ పి. శ్రీనివాసరావు పేర్కొన్నారు.