తెలంగాణ

సిరిసిల్ల ఘటన హేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: సిరిసిల్ల ఘటనలో అమాయకులను నిందితులుగా ముద్రవేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి పోలీసులు వారిని హింసించిన ఘటనపై కాంగ్రెస్ లెజిస్లేచర్ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తింది. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సిఎల్‌పి నేత జానారెడ్డి, సీనియర్‌నేతలు గీతారెడ్డి, భట్టివిక్రమార్క మాట్లాడుతూ కొందరు పోలీసుల చర్యల వల్ల మొత్తం తెలంగాణ పోలీసులకే మచ్చ వస్తోందన్నారు. సిరిసిల్ల ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, అమాయకులను చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. సిరిసిల్లకు కొంత మంది సిసిఎస్ పోలీసులు వచ్చి ఎనిమిది మందిని నిర్బంధంలోకి తీసుకుని నాలుగు రోజుల పాటు హింసించారన్నారు. ఈ విషయాన్ని బహిర్గతం చేస్తే కఠినమైన కేసులు నమోదు చేస్తామని మహిళలను కూడా బెదిరించారన్నారు. ఈ వ్యవహారంపై ఎస్సీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. హైకోర్టు, మానవ హక్కుల సంఘానికి సిరిసిల్ల ఉదంతాన్ని తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. దళిత మహిళల పట్ల పోలీసులు అమానవీయంగా వ్యవహరించారన్నారు. సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం వరుస స్కాంలో చిక్కుకుందని, ఇసుక మాఫియాకు ప్రభుత్వం అండదండలు ఇస్తోందన్నారు. వోటుకు నోటుకేసును మూసివేశారని, ఎమ్సెట్-2 లీకేజి కేసు చార్జిషీటునుదాఖలు చేయలేదని, మియాపూర్ భూస్కాంపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మాజీ ఎంపి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ దళితులకు కెసిఆర్ పాలనలో అన్యాయం జరుగుతోందన్నారు.

చిత్రం.. విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూన్న కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, గీతారెడ్డి, భట్టివిక్రమార్క