తెలంగాణ

సెప్టెంబర్ 10న రాష్ట్రానికి అమిత్‌షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా ఈ విషయాన్ని కోరుతున్నా మజ్లిస్‌ల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 10, 11, 12 తేదీల్లో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తారని, పార్టీ పనితీరుపై విస్తృత సమీక్ష నిర్వహిస్తారని అన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో హన్మకొండలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతాయని, రాబోయే మూడు నెలలు పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించి రాబోయే రోజుల్లో రూపొందించాల్సిన ఉద్యమాలకు రూపకల్పన చేస్తామని ఆయన వెల్లడించారు. ఉద్యమాల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసి, 2019లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా పనిచేస్తామని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకువెళ్లడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు.
రాష్ట్రంలో కల్తీ విచ్చలవిడిగా కొనసాగుతోందని, చివరికి ప్రాణాలు కాపాడే రక్తం కూడా కల్తీ అవుతోందని, నిత్యావసర వస్తువులు కల్తీకి గురికావడం పట్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా దొరకడం తీవ్ర ఆందోళనకర అంశమని, దానిపై యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమంగా ఇసుకను తరలిస్తూ గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్న వారిని మూడు గ్రామాల ప్రజలు అడ్డుకున్నారని, వారందరినీ అరెస్టు చేసి తీవ్ర చిత్ర హింసలకు గురిచేశారని, వారి పరిస్థితి విషమంగా ఉందని లక్ష్మణ్ అన్నారు.

చిత్రం.. గురువారం పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతున్న బిజెపి నేత లక్ష్మణ్