తెలంగాణ

తప్పించుకున్న చంద్రన్న దళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూలై 20: మహబూబాబాద్ జిల్లాలో తృటిలో భారీ ఎన్‌కౌంటర్ తప్పింది. జిల్లా పరిధిలోని గంగారం మండలం జంగాలపల్లి గ్రామంలో న్యూడెమోక్రసీ పెద్ద చంద్రన్న దళానికి చెందిన శ్యాం దళం వారి సభ్యులతో బుధవారం అర్ధరాత్రి గ్రామంలో అన్న, తమ్ముళ్ల పంచాయితీ చేస్తున్నారు. గ్రామంలో న్యూడెమాక్రసీ దళం పం చాయితీ చేస్తున్న విషయాన్ని కోవర్టులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసు ప్రత్యేక బలగాలు జంగాలపల్లికి చేరుకున్నాయి. పోలీసుల రాకను గమనించిన సాయుధ దళాలు అక్కడి నుండి తప్పించుకొని అడవిలోకి పారిపోయారు. పోలీసులు సంఘటనా స్ధలానికి వెళ్లి ఆరు కిట్ బ్యాగులు, 4సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నా రు. కాగా మహబూబాబాద్ జిల్లాలో మావోయిస్టు కంటే ఎక్కువ ప్రభావం న్యూడెమాక్రసీ దళాలదే ఉందని ఇటీవల మహబూబాబాద్ జిల్లా కు వచ్చి న రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ అన్నారు. త్వరలోనే న్యూడెమోక్రసీ దళాలపై దృష్టిపెడాతమ ని చెప్పిన కొద్ది నెలలకే ఈ సంఘటన జరిగింది. న్యూడెమాక్రసీ దళం చాకచక్యంగా పోలీసుల నుం డి తప్పించుకుంది. లేనట్లైతే భారీ ఎన్‌కౌంటర్ జరిగేది.
గంగారంలో...
గంగారం మండలంలోని జంగాలపల్లిలో న్యూడెమోక్రసీ పెద్ద చంద్రన్న వర్గానికి చెందిన ఇద్దరు సానుభూతి పరులను బుధవారం అర్ధరాత్రి అరెస్ట్ చేసినట్లు గూడురు సిఐ భూక్య రమేష్‌నాయక్ తెలిపారు. గంగారం పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రానికి 15కిలోమీటర్లదూరంలో ఉన్న జంగాలపల్లి తండాకు చెందిన బానోత్ యాకుబ్‌కు అదే గ్రామానికి చెంది న బానోత్ శివ రూ.30వేలు బాకీ ఉన్నాడు. అప్పు గా తీసుకున్న డబ్బులు రేపు, మాపు ఇస్తా అంటూ రోజులు దాటవేస్తున్నాడే తప్పా పైకం ఇవ్వడం లేదు. విసిగిపోయిన యాకుబ్ ఇకలాభం లేదని పెద్దచంద్రన్న వర్గానికి చెందిన అజ్ఞాత దళ నేత శ్యాంను ఆశ్రయించాడు. విషయం విన్న శ్యాం బుధవారం రాత్రి పంచాయితీ చేద్దామని ఇరువురికీ చెప్పి అదే రాత్రి జంగాలపల్లికి తన దళంతో పాటు చేరుకున్నాడు. శ్యాం దళం జంగాలపల్లిలో రాత్రి పంచాయితీ చేయడానికి వచ్చి ఉన్నారనే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రాత్రికి రాత్రే జంగాలపల్లికి వెళ్లారు. ఇక పంచాయితీ మొదలు పెడుదాం అనుకునే సమయానికి సరిగ్గా పోలీసులు అక్కడికి రంగ ప్రవేశం చేయడంతో గమనించిన దళ కమాండర్ శ్యాంతోపాటు ఐదుగురు దళ సభ్యులు కంగారుతో అక్కడే కిట్‌బ్యాగులు వదిలేసి పారిపోయారు. సంఘటనా స్థలంలో ఆరు కిట్‌బ్యాగులు దొరికాయని ఆ కిట్‌బ్యాగుల్లో దళ సభ్యుల బట్టలు లభ్యమయ్యాయన్నారు. దళాన్ని ఆశ్రయించిన బానోత్ యాకుబ్‌ను ఆ రాత్రి దళానికి ఆశ్రయం కల్పించిన దుప్పటి శ్రీనును అదే రాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం అరెస్ట్ చేసిన వారు బానోత్ యాకుబ్, దుప్పటి శ్రీనులను గురువారం నాడు గంగారం తహశీల్దారు యం.వెంకట్‌రెడ్డి ఎదుట బైండోవర్ చేసినట్లు గంగారం ఎస్సై సిహెచ్ బాలకృష్ణ తెలిపారు. వీరిద్దరూ పెద్ద చంద్రన్న వర్గానికి చెందిన అజ్ఞాత దళనేత శ్యాంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని ఇద్దరూ దళానికి ఆశ్రయం కల్పించినందునే అరెస్ట్ చేసి ఎమ్మార్వో ఎదుట హాజరు పరిచినట్లు ఎస్సై తెలిపారు.

చిత్రం.. విలేఖరులతో మాట్లాడుతున్న సిఐ రమేష్‌నాయక్