తెలంగాణ

భూసేకరణలో జాప్యమేల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: జాతీయరహదారుల నిర్మాణానికి భూసేకరణ విషయమై అధికారులు అవలంభిస్తున్న వైఖరి పట్ల రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత భూసేకరణ చట్టాలను అనుసరించి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రాంతాల్లో పరిహారం చెల్లింపు సమస్యలను అధిగమించేందుకు నూతన భూసేకరణ చట్టం జివో 120ని అనుసరించి పరిహారం చెల్లించేవిధంగా నియమావళిలో మార్పులు చేపట్టాలన్నారు. కేజెడ్ వీల్స్ ట్రాక్టర్ల వల్ల రహదారులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, అటువంటి ట్రాక్టర్లు రాకుండా నిరోధించాలని కూడా మంత్రి స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా కేజెడ్ వీల్స్‌తో ట్రాక్టర్ల చోదకులు రోడ్లపైకి వస్తే కేసు నమోదు చేయాలని ఆదేశించారు. శుక్రవారం నాడిక్కడ ఆర్‌అండ్‌బి ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో శాఖలో పలు విభాగాల పనితీరును మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడతూ రహదారుల నిర్మాణ క్రమంలో చెట్లను నరికివేయకుండా వాటిని ఇతర ప్రాంతాలకు తరలించి పునరుజ్జీవించే చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని అన్నారు. రోడ్డు పనుల్లో అలసత్వం వహించే కాంట్రాక్టర్ల విషయంలో కఠినంగా వ్యవహరించి అవసరమైతే వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయాలని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న రేడియల్ రహదారులను, ఇతర రహదారుల నిర్మాణ నిర్వహణ బాధ్యతలను గతంలోనే జిహెచ్‌ఎంసికి అప్పగించి నందున ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) లోపల ఉన్న తమ శాఖకు చెందిన అన్ని ప్రతిపాదనలు జిహెచ్‌ఎంసి లేదా హెచ్‌ఎండిఏకు బదలాయింపు సత్వరమే జరగాలని మంత్రి సూచించారు.
నిర్మాణంలో ఉన్న ఆర్‌ఓబి, ఆర్‌యుబిల జాప్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. నూతన సమీకృత జిల్లా కార్యాలయాల నిర్మాణాల పురోగతిని సమీక్షిస్తూ ఇంకా స్థల సేకరణ కాని జిల్లా కలెక్టర్లతో నేరుగా మాట్లడి ఆ పనులు వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. 2016-17లో మొక్కలు నాటిన పురోగతిని మంత్రి వివరిస్తూ ఆర్‌అండ్‌బి 1155 కి.మీ దూరంలో 4.62 లక్షల మొక్కలు నాటి 72.59 శాతం పురోగతిని సాధించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది 4312 కి.మీ దూరం 17.28 లక్షల మొక్కలు నాటాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. చెక్‌డ్యాంలతో కూడిన వంతెనల నిర్మాణ పురోగతిని మంత్రి సమీక్షించారు.