తెలంగాణ

‘మత్తు’లో ఇంకా ఎంత మందో!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: మత్తు పదార్థాలు (డ్రగ్స్) వినియోగిస్తున్న వారిలో ఇంకా ఎంత మంది ఉన్నారో! ఎక్సైజ్, టాస్క్ఫోర్సు పోలీసులకు అంతుచిక్కడం లేదు. తవ్విన కొద్దీ కొత్త వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏదో పది మంది పట్టుబడ్డారు, వారిని విచారించి, విచారణ ముగించే పరిస్థితి లేదు. ఒకరిని విచారిస్తే, మరో నాలుగైదు పేర్లు బయటపెడుతున్నారు. ఇలా విచారణ కొనసాగుతూనే ఉన్నది.
అసలైన వ్యక్తి కెల్విన్. ఆయన చుట్టూ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులే కాదు, ఇంకా, ఇంకా ఆధారాలతో బడాబాబుల కుమారులు, ఇంజనీరింగ్ విద్యార్థులూ ‘మత్తు’కు బానిసలయ్యారు. డ్రగ్స్ ర్యాకెట్లు బయటపడుతున్నాయి. గంజాయి సేవిస్తున్న వారూ పట్టుబడుతున్నారు.
ఇలాఉండగా కీలక సూత్రధారి కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా డ్రగ్స్‌కు బానిసలైన నలుగురు విద్యార్థులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. కెల్విన్ సృష్టించిన డార్క్‌నెట్ వెబ్‌సైట్ ద్వారా వీరు తమ ఇంటికే డ్రగ్స్ తెప్పించుకున్నట్లు తెలిసింది. నలుగురు విద్యార్థులు బడా కంపెనీ డైరెక్టర్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్, పోలీసు ఉన్నతాధికారికి చెందిన కుమారులని గుర్తించారు. ఈ విద్యార్థులు ఓ ఇంటర్నేషనల్ పాఠశాలలో విద్యాభాస్యం చేసే రోజుల్లో స్నేహితులై, కెల్విన్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. వీరికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు, వారి అడ్రసులతో సహా కెల్విన్ విచారణ సందర్భంగా పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. కాగా నలుగురు విద్యార్థులను అరెస్టు చేయకుండా భవిష్యత్తులో ఇటువంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎక్సైజ్ అధికారులు కౌనె్సలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలిసింది.
రైలులో పట్టుబడ్డ గంజాయి రూ.1,20,000 విలువ
ఇలాఉండగా లింగంపల్లి-తాండూరు రైల్వే స్టేషన్ల మధ్యన కోనార్క్ ఎక్స్‌ప్రెస్ (నెం.11020)లో రైల్వే పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో లక్షా 20 వేల రూపాయల విలువగ గంజాయి పట్టుబడింది. రైల్వే పోలీసుల తనిఖీలు ప్రారంభించడంతో మూడు గంజాయి బ్యాగులను వదిలేసి వెళ్లారు. తదుపరి విచారణ జరుగుతున్నదని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్‌వో ఉమా శంకర్ కుమార్ తెలిపారు.