తెలంగాణ

2.1 మిలియన్ల మందికి ఎయిడ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: భారతదేశంలోని మొత్తం 2.1 మిలియన్ల మంది ఎయిడ్స్‌రోగులు ఉండగా, సాలీనా కొత్తగా 80 వేల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులవుతున్నారు. ప్రపంచం మొత్తం మీద 95 శాతం ఎయిడ్స్ వ్యాధి ఉన్న పది దేశాల్లో భారత్ ఒకటి. ఈ వివరాలను యుఎన్ ఎయిడ్స్ రిపోర్టులో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే మొత్తం ఎయిడ్స్‌రోగుల్లో సగం మందికి వైద్యం అందుతోందని, ఇది మంచి పరిణామమని,కాని ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఈ వైద్య సదుపాయాలు విస్తరించాల్సి ఉందని ఈ నివేదిక పేర్కొంది.
ఈ వివరాలను యుఎన్‌ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేఖేల్ సిడ్బీ ప్రకటించారు. 2020 నాటికి ప్రపంచంలో 30 మిలియన్ల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు వైద్య చికిత్స అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఈ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ వల్ల మరణాలు 2005లో 1.9 మిలియన్లు ఉండగా, 2016 నాటికి ఈ సంఖ్య ఒక మిలియన్‌కు పడిపోయింది. అన్ని దేశాల్లో 36.7 మిలియన్ల మంది రోగులు ఉన్నారు.
వీరిలో 19.5 మిలియన్ల మందికివైద్య సహాయం అందుతోంది. ఆసియాపసిఫిక్ రీజియన్‌లో ఎయిడ్స్ వ్యాధి విస్తరిస్తోంది. ఎయిడ్స్ రోగులకు వైద్యం అందకపోవడానికి కారణం వైద్యం అందుబాటులో లేకపోవడం, పేదరికం, తక్కువ ఖర్చుతో ఎయిడ్స్ మందులు లభించకపోవడం కారణమని యుఎన్‌ఎయిడ్స్ పేర్కొంది. భారత్‌లోని 2.1 మిలియన్ల మంది ఎయిడ్స్‌రోగుల్లో 41 శాతం మందికి తమ పరిస్ధితి తెలుసుకుంటున్నారు. 1980లో తొలిసారిగా ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధి బయటపడినప్పటి నుంచి ఇంతవరకు 76.1 మిలియన్ల మంది ఆ వ్యాధికి గురయ్యారు. ఇందులో 35 మిలియన్ల మంది మృత్యువాత పడ్డారు. హెచ్‌ఐవి బారినపడిన వారిలో 90 శాతం మందికి ఈ వ్యాధిని నిర్ధారణ చేసి ఉందని చెప్పడం, వారికి యాంటిరెట్రోవైరల్స్ మందులు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు యుఎన్‌ఎయిడ్స్ నివేదికలో పేర్కొంది.