తెలంగాణ

నేటి నుండి 31 వరకూ ‘దోస్త్’ చివరి కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి సంబంధించి తుది విడత కౌనె్సలింగ్ ఈ నెల 22వ తేదీ నుండి నిర్వహిస్తున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ కె వెంకటాచలం పేర్కొన్నారు. ఈ నెల 22 నుండి 31వరకూ ఈ కౌనె్సలింగ్ జరుగుతుందని అన్నారు. ఈసేవ/మీ సేవ ద్వారా లేదా కాలేజీల హెల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణతో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. తర్వాత వెబ్ ఆప్షన్లు నమోదు చేయాలని, మొదటి, రెండో దశల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎలాంటి రుసుం లేకుండా అదే గుర్తింపు సంఖ్యతో వెబ్ ఆప్షన్లు నమోదు చేయాలని పేర్కొన్నారు. 28, 29 తేదీల్లో గేమ్స్-స్పోర్ట్సు, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్, సిఎపి, పిహెచ్, ఇతర సర్ట్ఫికేట్లు ఉన్న వారు యూనివర్శిటీ హెల్ప్ లైన్ సెంటర్లలో పరిశీలనకు హాజరుకావాలని అన్నారు. ఆగస్టు 4వ తేదీన సీటు అలాట్‌మెంట్ జరుగుతుందని, 11వ తేదీలోగా అభ్యర్థులు అలాట్‌మెంట్ ప్రింటవుట్ తీసుకుని కాలేజీకి వెళ్లి అడ్మిషన్ కన్ఫర్మేషన్ చేసుకోవాలని సూచించారు.