తెలంగాణ

23న తెలంగాణ టెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: తెలంగాణలో ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్‌కు అర్హత పరీక్ష టీచర్సు ఎలిజిబిలిటీ టెస్టు (టెట్)ను ఈ నెల 23వ తేదీన నిర్వహిస్తున్నట్టు సెట్ కన్వీనర్ శేషుకుమారి తెలిపారు. 31 జిల్లాల్లో ఉదయం ఒక పేపర్, సాయంత్రం ఒక పేపర్ నిర్వహిస్తున్నామని, పేపర్ -1 ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12 వరకూ, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం ఐదు వరకూ జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం 31 జిల్లాల్లో 1574 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొత్తం 3,67,912 మంది హాజరవుతున్నారని చెప్పారు. పేపర్-1కు 1,11,647 మంది కోసం 483 కేంద్రాలు, పేపర్-2కు 2,56,265 మంది కోసం 1091 కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు ఆమె వివరించారు. పరీక్షకు ముందు రోజే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను చూసుకోవాలని, కనీసం గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌లో కేటాయించిన కేంద్రంలో మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుందని, ఎలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించమని వివరించరు. ఒఎంఆర్ సర్కిల్స్ నింపేందుకు నల్లని బాల్‌పాయింట్ పెన్‌ను వాడాలని, ఒఎంఆర్ షీట్‌ను మడతపెట్టడం, చించడం, స్టాపుల్ చేయడం తగదని, అలాగే బార్‌కోడ్‌ను, బ్లాక్ రిఫరెన్స్ పాయింట్‌ను కూడా పాడు చేయరాదని సూచించరు. బుక్‌లెట్ కోడ్ సర్కిల్‌ను తప్పనిసరి పూరించాలని లేకుంటే ఆయా ఒఎంఆర్‌లను మూల్యాంకనం చేయడం కుదరదని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాలు , కేంద్రాల వారీ పరీక్ష రాస్తున్న అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.
ఎడ్‌సెట్ కీ విడుదల
తెలంగాణ ఎడ్‌సెట్ కీ విడుదల చేసినట్టు సెట్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం చెప్పారు. సెట్ కీపై అభ్యంతరాలుంటే ఈ నెల 22వ తేదీలోగా ఆన్‌లైన్‌లో సూచించాలని, దానికి అనుగుణంగా తుది కీ రూపొందించడం జరుగుతుందని చెప్పారు.