తెలంగాణ

జూరాల నుంచి తక్షణమే నీళ్లొదలాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంలో వివక్ష చూపిస్తోందని గద్వాల శాసనసభ్యురాలు డికె అరుణ మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు కింద ఉన్న రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే రైతులు ధర్నా చేసి వ్యవసాయ అవసరాలకు నీటిని విడుదల చేయాలని కోరారని అన్నారు. గత ప్రభుత్వం అవసరాలకు అనుగుణంగా సాగునీటిని విడుదల చేసేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం సవతి తల్లి వైఖరి కనబరుస్తోందని తెలిపారు. కోయిల్‌సాగర్‌కు నీళ్లొదులుతున్న ప్రభుత్వం, ఆయకట్టు రైతాంగానికి ఎందుకు వదలడం లేదని ప్రశ్నించారు. ఒకే ప్రభుత్వం రెండు రకాలుగా ఎందుకు వ్యవహరిస్తోందని అడిగారు.
రైతులను ఆదుకోవడంలో విఫలం
తెలంగాణ రాష్ట్రంలో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. రైతులు చాలా సమస్యల్లో ఉన్నారని, రుణాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని స్వయంగా గవర్నర్ వెల్లడించారని గుర్తు చేశారు.
శుక్రవారం నాడిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతుల సమస్యలపై వెంటనే టాస్క్ఫోర్స్ కమిటీ వేయాలని ఆయన కోరారు.
ఎన్నికల హామీలను అమలు చేయాలి
గత ఎన్నికల్లో తెరాస పార్టీ ఎస్‌టిలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టిపిసిసి ఎస్‌టి సెల్ అధ్యక్షుడు రవీంద్ర నాయక్ సిఎం కెసిఆర్‌ను డిమాండ్ చేశారు. శుక్రవారం నాడిక్కడ ఆయన గన్‌పార్కులోని అమరవీరుల స్ధూపం వద్ద మాట్లాడుతూ ప్రతి తండా అభివృద్ధికి రూ.1 కోటి నుంచి 5 కోట్ల వరకు నిధులు కేటాయించాలని కోరారు. గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని కోరారు.