తెలంగాణ

రోడ్డు వసతి ఉంటే.. ప్రతి గ్రామానికీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెబ్బేరు, జూలై 21: రాష్ట్రంలో రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని, ప్రజలకు అందుబాటులో ఉండి రవాణ సేవలు అందించడమే తమ లక్ష్యమని రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్ర సమీపంలో రూ.1.14 కోట్లతో నూతనంగా నిర్మించిన మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నామని, వీటి కోసం రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించిందని చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నా రు. ఇప్పటికే రూ.15కోట్లతో రాష్ట్రంలోనే మొట్టమొదటగా శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏడాదికి 20వేల మంది డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రానికి రూ.5 కోట్లు కేటాయిస్తున్నామని, స్థలం కేటాయిస్తే నిధులు మంజూరు చేయడానికి తమ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో డిపిఓ కార్యాలయంలో సిబ్బందిని నియమిస్తామని, వనపర్తి జిల్లా కేంద్రంలో శాశ్వత భవనం మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
మంత్రి జూపల్లి మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లాలో అదనపు బస్సు డిపోలు ఏర్పాటుచేసి, విద్యార్థుల కోసం ప్రత్యే క బస్సులు కేటాయించాలని సూచించారు. నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి, అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. అంతకుముందు వీరంతా స్థానిక మోడల్ స్కూల్ భవనంలో హాస్టల్‌ను ప్రారంభించారు. వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ బండారి భాస్కర్, కలెక్టర్ శే్వతామహంతి, రవాణా శాఖ అధికారులు రమేష్, మమత, లక్ష్మి, జావీద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే చిన్నారెడ్డిలు ఆర్టీసి బస్టాండ్‌లోని షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించి, బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు.

చిత్రం.. మోటార్ వెహికిల్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, మంత్రి జూపల్లి, నిరంజన్‌రెడ్డి