తెలంగాణ

ఉక్కు పరిశ్రమను స్థాపించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూలై 21: మహబూబాబాద్ జిల్లా బయ్యారం పరిసర ప్రాంతాలలో దాదాపు లక్షా యాబైవేల హెక్టార్‌లలో విస్తరించి ఉన్న ఇనుపఖనిజం నిల్వలను బడా కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యు డు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. మండల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బయ్యారం బస్టాండ్ సెంటర్‌లో చేపట్టిన మహాధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. దేశంలో ఎక్కడలేని విధంగా 700 లక్షల కోట్ల ఖనిజ సంపద ఇక్కడ ఉందని, అయతే ఇది నాణ్యమైన ఖనిజం కాదని, ఉక్కు పరిశ్రమకు ఉపయోగపడదని కుంటిసాకులు చెబుతూ కేంద్ర ప్రభుత్వం కాలం వెల్లబుచ్చుతోందని ఆయన విమర్శించారు. ఇక్కడి ఖనిజం నాణ్యమైంది కానప్పుడు దాదాపు 20 సంవత్సరాల క్రితం విదేశాలకు ఎలా ఎగుమతి చేశారని ఆయన ప్రశ్నించారు. ఉక్కు పరిశ్రమ స్థాపిస్తే వారికి కమీషన్‌లు రావ ని, కార్పొరేట్ సంస్థలైతేనే తమ జేబులు నింపుతాయని ఏదో ఒక సాకు చూపుతూ ప్రరిశ్రమను నిర్మించకుండా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని ఆయన విమర్శించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని బిల్లు రూపొందించి మూడేళ్లు గడచినా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి తేకపోవడం వెనుక మతలబు ఏమిటని ఆయన నిలదీశారు.
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ, బయ్యారం లో ఉక్కు పరిశ్రమ నిర్మిస్తే ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబానికి ఎలాంటి ఆదాయ వనరులు లభించవని, అందుకే కమీషన్‌లు లభించే మిషన్ కాకతీయ లాంటి పథకాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని విమర్శించారు. ఉక్కు పరిశ్రమకు అవసరమైన వౌలిక వనరులన్నీ ఈ ప్రాంతంలో ఉన్నాయని, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సెయిల్ బృందం సైతం క్లీన్‌చిట్ ఇచ్చినప్పటికీ కాలయాపన చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ అడగగానే రాష్టప్రతి ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థికి మద్దతు తెలిపిన కెసిఆర్‌కు ఇక్కడ ఉక్కుపరిశ్రమ ఎందుకు గుర్తురావడం లేదని నిలదీశారు. పరిశ్రమ సాధనకు విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు, కార్మికులు, కర్షకులు అందరు ఎకమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిశ్రమను సాధించుకునే వరకు అందరూ ఉద్యమంలో కలసిరావాలని పిలుపునిచ్చారు.

చిత్రం.. సభలో మాట్లాడుతున్న సిపిఐ జాతీయ నాయకులు కూనంనేని సాంబశివరావు