రాష్ట్రీయం

వైభవంగా పంచమీ తీర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుచానూరు, డిసెంబర్ 16: లక్షలాది భక్తజన సందోహం గోవింద నామస్మరణల మధ్య బుధవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం కన్నుల పండువగా జరిగింది. మూడు లక్షల మందికి పైగా భక్తులు పద్మసరోవరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అమ్మవారు అవతరించిన పద్మసరోవరంలో జరిగే చక్రస్నానం రోజున పుణ్యస్నానం ఆచరిస్తే కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఆ నమ్మకంతోనే రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఉదయం 6 గంటల నుంచే భక్తులు పద్మసరోవరంలోకి దిగేందుకు క్యూ కట్టారు. దీంతో భక్తుల మధ్య స్వల్పంగా తోపులాట చోటుచేసుకుంది.
కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి స్వయంగా తన కుంతాయుధంతో తవ్విన పద్మ సరోవరంలో కార్తీక మాసం శుక్ష పక్ష పంచమీ తిథి, ఉత్తరాషాడ నక్షత్రంలో శుక్రవారం రోజున స్వర్ణ కమలంలో అమ్మవారు పద్మావతీ దేవిగా అవతరించారని పురాణ ప్రశస్తి. ఉదయం 6.30 గంటలకు పల్లకీ వాహన సేవ జరిగింది. అనంతరం అమ్మవారు, చక్రత్తాళ్వార్ విగ్రహాలను సన్నిధి నుంచి వేంచేపుగా పురవీధుల్లోని పంచమీ తీర్థ మండపానికి తీసుకువచ్చి కొలువుదీర్చారు. తరవాత అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 11.45 గంటల సమయంలో ధనుర్లగ్నంలో చక్రత్తాళ్వార్‌ను పద్మసరోవరంలో పంచమీ తీర్థాన్ని వైభవంగా నిర్వహించారు.
వేడుకగా ధ్వజావరోహణం
పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణంతో వైభవంగా ముగిసాయి. బంగారు తిరుచ్చిపై తిరుమాఢ వీధులలో ఊరేగుతూ అమ్మవారు భక్తులను ఆశీర్వదించారు. అనంతరం శాస్త్రోక్తంగా అర్చకులు గజ చిత్రపటాన్ని ధ్వజ స్థంబం నుంచి దించారు.

పంచమీ తీర్థం సందర్భంగా బుధవారం తిరుచానూరు పద్మసరోవరానికి పోటెత్తిన భక్తులు