రాష్ట్రీయం

‘సాగు’తున్న యాదాద్రి పనులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 21: యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి దేవస్థానం విస్తరణ నిర్మాణ పనులు ఒక్కొక్కటిగా ముందుకు సాగుతున్నాయి. వచ్చే దసరా నాటికి స్వామివారి గర్భాలయం దర్శనాలు పునఃప్రారంభించే దిశగా ప్రణాళిక మేరకు పనులు సాగుతున్నా కొండపైన శిల్పాలు, ఇతర నిర్మాణాలు సాగించడంలో కొంత జాప్యం కొనసాగుతోంది. సిఎం కెసిఆర్ యాదాద్రిని తిరుమల తిరుపతి తరహాలో దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో దాదాపుగా రూ.800 కోట్ల అంచనా వ్యయం తో ఆలయ పునర్ నిర్మాణ పనులు ఆరంభించారు. కొండపై ప్రధాన ఆలయం రూ.172 కోట్ల వ్యయంతో 2.33 ఎకరాల విస్తీర్ణంలో సాగుతుండగా, రెండు మాఢ వీధులు, ఆరు రాజగోపురాలు, దివ్యవిమాన గోపురం నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. గర్భగుడి చుట్టు ఉన్న కట్టడాల తొలగింపు పూర్తి చేసి నిర్మాణ పనులు ఆరంభించారు. రక్షణగోడ, గర్భగుడి మధ్య ఉన్న లోయను పూడ్చివేస్తున్నారు. ప్రధాన ఆల యం చుట్టు రక్షణ గోడ, ప్రాకారాల నిర్మాణం అధిక శాతం పూర్తయినా శిలలతో నిర్మించాల్సివున్న రాజగోపురాలు, ముఖ మండపం, ప్రవఛన మండపం, ఇతర శిల్పాల నిర్మాణాల పనుల్లో సహజంగానే జాప్యం సాగుతుంది. శిలలను సైజ్ చేసుకుంటూ వివిధ ఆకృతుల్లో వాటిని మలుచడంలో ఆధునిక మిషనరీ వినియోగిస్తు పనులు సాగిస్తున్నప్పటికి ఎక్కడ పొరపాటు లేకుండా నైపుణ్యంతో నాణ్యతతో పనులు జరిపిస్తున్నారు. తూర్పు, ఉత్తర, పడమటి రాజగోపురాల పనులు రెం డో అంతస్తు దశకు చేరుకున్నాయి. వాటి నిర్మాణాలకు కావాల్సిన శిలాకృతులను యాదగిరిగుట్ట దిగువన రాయగిరి, వడాయిగూడెం శివారులలో రెండుచోట్ల శిల్పాల తయారీ కేంద్రాల్లో వందలాది మంది శిల్పులు ఆహర్నిశలు పనులు సాగిస్తున్నారు. కొండపై పుష్కరణి విస్తరణ పనులకు సన్నాహాలు చేపట్టారు.
సిద్ధమవుతున్న అద్భుత శిల్పాలు
ఆలయ పునర్ నిర్మాణంలో భాగంగా ప్రతిష్టించే నవనారసింహుల రూపాలు, దశావతారాలు, అష్టలక్ష్మి అవతారాలు, పనె్నండు మంది ఆళ్వార్ల శిలా విగ్రహాలు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని మార్కాపురం, ఆళ్లగడ్డ, గురజాల, మార్టూరు, కోహేడ ప్రాంతాల్లోని శిల్ప కేం ద్రాల్లో సిద్ధమవుతున్నాయి. యాదాద్రి ఆలయ సందర్శనకు వచ్చే భక్తులు అపూరూప శిల్ప సంపదతో కూడిన ఆయా దేవతామూర్తులను తలుచుకుని ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్లేలా శిల్పాల తయారీ సాగిస్తున్నారు. 108 స్తంభాలతో వాటిపై పురాణ గాథల, దేవతామూర్తుల శిల్పాలతో అష్ట్భుజ మండపాలతో పంఛనారసింహుడి దివ్యాలయం నిర్మితం కానుంది. కొం డపై ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణ పనులు చేపట్టారు. క్షేత్ర పాలకుడైనా ఆంజనేయ స్వామి 108 అడుగుల విగ్రహా స్థాపనకు యాడా బృందం చైనాను సందర్శించి విగ్రహా తయారిపై తుది కసరత్తు సాగిస్తుంది. మరోవైపు శివాలయం పునర్ నిర్మాణ పనులకు సైతం శ్రీకారం చుట్టారు. గర్భాలయం చుట్టు మూడంతరాల రాజగోపురం, ప్రాకారాలు, వివిధ దేవతావిగ్రహాలన్నింటిని శిలలతోనే రూపొందిస్తారు. అష్టాదశ శక్తిపీఠాల దేవతల విగ్రహాలు, ద్వాదశ జ్యోతిర్లింగాల మూర్తుల శిలావిగ్రహాలను ఏర్పాటు చేస్తారు.
నవగిరులపై నిర్మాణాల పురోగతి
యాదాద్రి కొండ చుట్ట ఉన్న నవగిరుల అభివృద్ధిలో భాగంగా పెద్దగుట్టపై 258ఎకరాల్లో ఆధునాతన కాటేజీల, ఉద్యానవనాల నిర్మాణాలకు లేఅవుట్‌ల ఖరారు తుది దశకు చేరుతుంది. 1000, 1500గజాలతో లేఅవుట్‌లు సిద్ధం చేసి నిర్మాణ నమూనాలను దాతలకు అందించనున్నారు. ఇదే గుట్టపై ప్రెసిడెన్షియ సూట్స్ నిర్మాణానికి మరో 139ఎకరాలక భూసేకరణ సైతం యాడా చేపట్టింది. గతంలో 166ఎకరాలు మాత్రమే ఉన్న యాదాద్రి ఆలయం భూములు సిఎం కెసిఆర్ దాదాపుగా 800కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 2050ఎకరాల కు విస్తరించాయి.
ఇందులో భూసేకరణలో 76కోట్లతో 1,242ఎకరాలను కొనుగోలుచేశారు. 2,133ఎకరాల భూసేకరణ ప్రక్రియలో సమకూరిన 2050ఎకరాల్లో ప్రైవేటు భూములు 676ఎకరాలు, ప్రభుత్వ భూములు 565ఎకరాలు, గుట్ట ఆలయానికి చెందిన 166ఎకరాలు, అటవీశాఖ ఇచ్చిన భూములు 476ఎకరాలు, యాదగిరిపల్లి, గుండ్లపల్లి, రాయగిరి చెరువులకు చెందిన 174ఎకరాలున్నాయి. అటవీ భూముల్లో నృసింహ అభయారణ్యానికి, ఉద్యానవనాలు నిర్మిస్తారు.
ఆలయ అభివృద్ధిలో మరిన్ని నిర్మాణాలు
యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా కొత్తగా లక్ష దీపారాధన మండపం, ఊంజల్ సేవ అద్ధాల మం డపం, ఒకేసారి వేయి వ్రతాలకు వీలుగా సత్యనారాయణ వ్రత మండపం, ప్రవఛన మండపం, వేద పాఠశాల, 5వేల మంది మొక్కులు తీర్చుకునేలా కల్యాణకట్ట, హనుమాన్ దీక్ష భక్తుల మండపం, 5వేల వాహనాల పార్కింగ్ చేసేలా బహుళ అంతస్తుల పార్కింగ్ స్థలం నిర్మాణ పనులు, నిత్యకల్యాణ మండపం, యాగశాలల నిర్మాణ పనులు చేపడుతారు.

చిత్రాలు.. ప్రధాన ఆలయం చుట్టు నిర్మాణ పనులు..రాజగోపురాల నిర్మాణాల దృశ్యాలు