తెలంగాణ

ఇంజనీరింగ్‌లో 15,643 సీట్ల్లు మిగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: ఇంజనీరింగ్ కాలేజీల్లో శనివారం నాడు రెండో దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 317 కాలేజీల్లో 70427 సీట్లకు గానూ 54,784 సీట్లు భర్తీ అయ్యాయి. 15,643 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 14 యూనివర్శిటీ కాలేజీల్లో 3060 సీట్లకు 3041 సీట్లు, 187 ప్రైవేటు కాలేజీల్లో 63787 సీట్లకు 51542 సీట్లు భర్తీ అయ్యాయి. బి ఫార్మసీలో 3 యూనివర్శిటీ కాలేజీల్లో 80 సీట్లకు 24 సీట్లు భర్తీ కాగా, ఫార్మా డి కోర్సును ఆఫర్ చేస్తున్న 51 విద్యాసంస్థల్లో 503 సీట్లకు 49 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంజనీరింగ్‌లో 12,264 ఖాళీలు, బి ఫార్మసీలో 3379 సీట్లు మిగిలాయి. ఒక్క కాలేజీలో సున్నా అడ్మిషన్లు కాగా, 76 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన వారు జూలై 28వ తేదీలోగా ఫీజు చెల్లించాలని అన్నారు.
32 కాలేజీల్లో 50లోపు సీట్ల భర్తీ
ఒక కాలేజీలో సున్నా అడ్మిషన్లు జరగ్గా, నాలుగు కాలేజీల్లో కేవలం ఐదులోపు అడ్మిషన్లు జరగ్గా 10లోపు అడ్మిషన్లు రెండు కాలేజీల్లోనూ, 15లోపు అడ్మిషన్లు ఏడింట, 20లోపు అడ్మిషన్లు రెండింట, 25లోపు అడ్మిషన్లు నాలుగింటిలో, 30లోపు అడ్మిషన్లు రెండింట, 35లోపు అడ్మిషన్లు ఐదింటిలో, 40లోపు అడ్మిషన్లు మూడింట, 45లోపుఅడ్మిషన్లు ఒకదాంట్లో, 50లోపు అడ్మిషన్లు ఒకదాంట్లో జరిగాయి. 56 కాలేజీల్లో 100లోపు అడ్మిషన్లు జరిగాయి. 83 కాలేజీల్లో 150లోపు అడ్మిషన్లు జరిగాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో 1613, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో 1508, ఇసిఇలో 2854, ట్రిపుల్‌ఇలో 3059, మెకానికల్‌లో 3144 సీట్లు మిగిలాయి.