తెలంగాణ

సౌతాఫ్రికానుంచి రవితేజకు డ్రగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. 12మంది సినీ ప్రముఖులకు సిట్ నోటీసులు అందజేసింది. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్, కెమెరామెన్ శ్యాం కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్‌లను సిట్ విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా మరో ఇద్దరు అరెస్టయినట్టు సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సిట్ కస్టడీలో ఉన్న డ్రగ్స్ మాఫియా జీషన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మహమ్మద్ ఉస్మాన్ అలియాస్ ఫైసల్, అర్నవ్ మండల్‌ను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 10 గ్రాముల ఎండిఏ, 7 గ్రాముల మ్యాజిక్ మశ్రూమ్‌ము స్వాధీనం చేసుకున్నట్టు సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇదిలావుండగా కస్టడీలో ఉన్న జీషన్, విలియమ్‌ను విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్టు అధికారులు తెలిపారు. జీషన్ సౌతాఫ్రికా నుంచి డ్రగ్స్ తెప్పించి సినీ హీరో రవితేజ ద్వారా సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులకు సరఫరా చేసినట్టు వెల్లడైందని అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మరికొంత మంది సినీ ప్రముఖుల పేర్లు బయటపడే అవకాశం ఉందని, అయితే వీరెవరు? వీరికి ఎప్పుడు నోటీసులు పంపించాలి అనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. కాగా హీరో రవితేజను విచారించిన తరువాతే మరికొంత మంది సినీ ప్రముఖులకు నోటీసులు పంపనున్నట్టు సిట్ అధికారులు తెలిపారు. ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు అందగా, మరో ఎనిమిది మంది ప్రముఖులకు నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది.

చిత్రం.. సినీ హీరో రవితేజ