తెలంగాణ

అధికారికంగా విమోచన దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 22: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బిజెపి డిమాండ్ చేసింది. అవసరమైతే ఈ విషయంలో రాష్టవ్య్రాప్తంగా వచ్చే రెండునెలల పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ నిర్ణయించింది. ప్రపంచంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకోని ప్రాంతం తెలంగాణ ఒక్కటేనని బిజెపి పేర్కొంటూ, ఈ విషయంలో కెసిఆర్ నాయకత్వంలోని తెరాస సర్కారు అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టింది. రెండు రోజుల పాటు జరిగే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు వరంగల్‌లో శనివారం మొదలయ్యాయి. మొదటిరోజు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మోర్చాల అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షులు, జిల్లాల ఇన్‌చార్జ్‌లతో కూడిన కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు హన్సరాజ్ అహీర్, బండారు దత్తాత్రేయ, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, పార్టీ శాసనసభాపక్ష నాయకుడు కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ అంశాలపై కోర్‌కమిటీ సమావేశంలో నాయకులు విస్తృతంగా చర్చలు జరిపారు. ఆదివారం జరిగే కార్యవర్గ సమావేశంలో ఈ అంశాలను ప్రవేశపెట్టి మరోసారి చర్చ జరిపిన అనంతరం ఆమోదించాలని నిర్ణయించింది. కోర్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను పార్టీ ప్రతినిధులు ప్రేమేందర్‌రెడ్డి, డాక్టర్ రాజేశ్వర్‌రావు మీడియాకు వివరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగిన సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం గురించి పదేపదే మాట్లాడిన కెసిఆర్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవం గురించి ఊసెత్తకపోవటంపై కోర్ కమిటీ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. మజ్లిస్‌ను మచ్చిక చేసుకోవటానికి, నిజాం వారసులకు కోపం వస్తుందనే అభిప్రాయంతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలనే అంశాన్ని మరుగున పడేయటాన్ని సమావేశం తప్పుబట్టింది. సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి హన్సరాజ్ అహీర్ కూడా విమోచన దినోత్సవం సభ్యుల అభిప్రాయాలకు సంఘీభావం చెబుతూ ఈ విషయంలో పార్టీపరంగా చేపట్టే కార్యక్రమానికి మద్దతు ఇస్తామని చెప్పారు. తెలంగాణ విమోజన దినోత్సవం అధికారికంగా జరపాలని 1998 నుంచి బిజెపి ఆందోళన చేస్తున్న విషయాన్ని సమావేశంలో గుర్తుచేసుకుంటూ తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా విమోచన దినోత్సవం జరపకపోవటం శోచనీయమని అభిప్రాయం వ్యక్తం చేసింది.
తెరాస అధికారంలోకి వచ్చాక డ్రగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరిపోవటంపై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార కల్తీ, విత్తనాలు, ఎరువుల కల్తీ విషయంలో ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వీటిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అధికార పార్టీకి చెందిన కొందరు ఈ మాఫియాకు అండగా నిలుస్తున్నారని కోర్‌కమిటీ ఆరోపించింది. అభివృద్ధి పేరిట దోపిడి కొనసాగుతోందని, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై మీడియాలో కథనాలు వచ్చిన సందర్భంలో విచారణ పేరిట కొన్ని రోజులు హడావుడి చేస్తున్న ప్రభుత్వం ఆ తరువాత వాస్తవాలను కప్పిపుచ్చుతోందని విమర్శించింది. రైతుల సమస్యల పట్ల కెసిఆర్ సర్కారు ఉదాసీన వైఖరి అవలంబించడంపై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. కల్తీ విత్తనాలు, క్రిమిసంహారక మందులతో రైతులు దగా పడుతున్నారని, పంటలు చేతికి వచ్చాక గిట్టుబాటు ధరలు లభించక రైతులు నష్టపోతున్నారని సమావేశం అభిప్రాయం వ్యక్తం చేసింది. తెరాస ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, రైతాంగ దుస్థితిపై ప్రజల్లో విస్తృత ప్రచారం జరపాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు ద్విముఖ వ్యూహం అవలంబించాలని కోర్‌కమిటీ సమావేశం నిర్ణయించింది.

చిత్రం.. బిజెపి కోర్‌కమిటీ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు హన్సరాజ్ అహీర్, దతాత్రేయ, పార్టీ రాష్ట్ర నాయకులు