తెలంగాణ

మిడ్ మానేరు నుంచి సాగునీరు అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిగురుమామిడి, జూలై 22: ఈఏడాది చివరికల్లా మిడ్‌మానేరు నుంచి సైదాపూర్, చిగురుమామిడి మండలాలకు తోటపల్లి లింక్ కెనాల్ ద్వారా పంట, పొలాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరాఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఉల్లంపల్లి, రేకొండ, చిగురుమామిడి, చిన ముల్కనూర్ గ్రామాల్లో పర్యటించిన మంత్రి ఈటల, స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌లు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. చిగురుమామిడి బస్టాండ్ చౌరస్తాలో స్థానిక సర్పంచ్ గీకురు రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం కోసం నిధులను ఎమ్మెల్యే, తాను సమష్టిగా నిధులను, సుందరగిరి-ఉల్లంపల్లి తారు రోడ్డును మంజూరు చేస్తామన్నారు. రేకొండకు చిగురుమామిడి మీదుగా బస్సును సౌకర్యాన్ని కల్పినకు ఆర్‌ఎంతో మాట్లాడుతానన్నారు. 2005లో మొదలైన మిడ్‌మానేరు ప్రాజెక్ట్ గత పాలకుల నిర్లక్ష్యంతో నిర్మాణంలో జాప్యం జరిగిందని, ఈమూడేళ్లలో వందశాతం పూర్తి చేసుకొని 10 టిఎంసిల నీరు నిల్వ ఉంచి, గండిపల్లి, గౌరవెళ్లి ప్రాజెక్ట్‌లకు సాగునీటి కోసం నీ
టిని తరలిస్తామన్నారు. పేదవాడు ఖరీదైన వైద్యం కోసం ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లకుండా నేడు కోట్లాది రూపాయలను వెచ్చించి జిల్లా, ఏరియా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులను సకల హంగులతో సరిపడా వౌలిక వసతులు కల్పించి ఆధునీకరిస్తున్నామన్నారు. రూ.40 కోట్లతో ఆర్టీసి బస్టాండ్‌లలో వౌలిక వసతుల కల్పనతో ఆధునికరిస్తామన్నారు. రజకులకు, నాయా బ్రాహ్మణులకు ఆధునిక సెలున్లు ఇస్తామన్నారు. తెలంగాణ పేదరాష్ట్రం కాదని 50ఏండ్ల సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో చెట్లను నాటిచ్చే బాధ్యత ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలదేనన్నారు. చినముల్కనూర్ గ్రామాభివృద్ధి రాబోయే కాలంలో జరగబోయే అభివృద్ధికి ఆదర్శమైన సూచికని చెప్పారు. ఎమ్మెల్యే సతీష్‌కుమార్ మాట్లాడుతూ 33శాతం చెట్లను నాటాలని, ప్రాణవాయువు ఇచ్చే చెట్లను నాటి సంరక్షించాలని అన్నారు. ఇంటి ఆవరణల్లో, పంట, పొలాల గట్లపై విరివిగా మొక్కలను నాటాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ కోటి పదిలక్షల మొక్కలు నాటి జిల్లాను హరితహారంలో అగ్రభాగాన నిలబెట్టాలని మండల ప్రజలను కోరారు.

చిత్రం.. చిగురుమామిడి సభలో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్, వేదికపై ఎమ్మెల్యే సతీష్ కుమార్, కలెక్టర్ సర్ఫరాజ్