తెలంగాణ

రజాకార్లను మరిపిస్తున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, జూలై 22: నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ సమన్యాయం ప్రాతిపదికన జరిగిన ఉద్యమ ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక తొలి ప్రభుత్వాధినేత కేసిఆర్ పరిపాలన రజాకార్లను మరిపిస్తస్తోందని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మూసపేట రామరాజు ఆరోపించారు. ధర్మపురి క్షేత్రంలో గోదావరి తీరాన కర్నె అక్కపెల్లి కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న రెండు రోజుల విహెచ్‌పి రాష్ట్ర స్థాయి వర్షారంభ సమావేశ తొలిరోజున కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో రామరాజు మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర కాముకులైన ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వ తీరు నిరాశను కలిగిస్తోందన్నారు. హిందువులు అధికంగా కలిగిన రాష్ట్రంలో మైనారిటీల ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో తొలి పంద్రాగస్టు వేడుకలలో కేసులు పెట్టడం, గోదావరిఖనిలో లోకమాన్య తిలక్ విగ్రహావిష్కరణను అడ్డుకోవడాన్ని సమర్థించడం ఉదాహరణలు మాత్రమేనన్నారు. కేసిఆర్ ద్వంద్వ వైఖరి, సమాజ ద్రోహ చర్యల వల్లే ఇలా జరుగుతున్నాయన్నారు. హిందువులు మేల్కొని, అన్యాయాలను తెలుకుంటున్నారని, ఇది ఎంతోకాలం ఉండబోదన్నారు. విహచ్‌పి రాష్ట్ర కార్యదర్శి మాధవరెడ్డిగారి గాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాల్వ వెంకట రాజరెడ్డి, కార్యదర్శి గజం రాజ్ కుమార్, జిల్లా దుర్గా వాహిని సంయోజిక బోగ రాగిణి, ధర్మపురి మండల నేతలు పిల్లి శ్రీనివాస్, బండారి లక్ష్మణ్, సంగి నర్సయ్య, రంగు లక్ష్మీనరహరి, అల్లె రాజేశం తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న విహెచ్‌పి రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు