తెలంగాణ

సాగర మథనం ఆరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: సరైన వర్షాలు లేక కృష్ణానది ప్రాజెక్టులైన జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో నీటి మట్టం పడిపోవడంతో హైద్రాబాద్-నల్లగొండల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఇరిగేషన్, హైద్రాబాద్ మెట్రోవాటర్ వర్క్స్‌లు భగీరథ ప్రయత్నం ఆరంభించాయి. ఏఎమ్మార్పీ పుట్టంగండి మోటార్లకు సరిపడ నీరందించేందుకు సాగర్ జలాశయంలో పుట్టంగండి జీరో పాయింట్ నుండి అప్రోచ్ కెనాల్‌ను జలాశయం నీటిలో మరో కిలోమీటర్ మేరకు పొడిగించేందుకు చేపట్టిన తవ్వకం(డ్రెడ్జింగ్) పనులు సోమవారం ప్రారంభించారు. జలాశయం నీటిలో తేలియాడే విధంగా ఫొంటాన్ ఇనుప బాక్సులతో నిర్మించిన బల్లకట్టుపై భారీ ప్రొక్లెయిన్‌ర్‌ను, దానిని బ్యాలెన్సింగ్ చేసేందుకు మరో జేసిబిని అమర్చి నీటిలో అప్రోచ్ కెనాల్ పొడిగింపు పనులు ప్రారంభించారు. సాగర్ జలాశయం కనిష్ట నీటి మట్టం 510 అడుగులకుగాను ప్రస్తుతం 501.02 అడుగులుగా ఉంది. ఇటీవల శ్రీశైలం నుండి సాగర్ జలాశయానికి రెండు టిఎంసిలు విడుదలవ్వగా అందులో ఒక టిఎంసి ఏపికి విడుదల చేశారు. జలాశయం నీటి మట్టం కనిష్ట స్థాయికి దిగువకు పడిపోవడంతో ఏఎమ్మార్పీ ఎమర్జన్సీ మోటార్లను, ప్రధాన మోటార్లను పూర్తి స్థాయిలో నడిపించేందుకు నీరందడం లేదు. ఎమర్జన్సీ మోటార్లు పదింటిలో ఎనిమిది మోటార్లను నడిపిస్తున్నా 780క్యూసెక్కులనే ప్రధాన మోటార్లకు అందిస్తుండటంతో ఒకటి తర్వాత మరొక ప్రధాన మోటార్‌ను నడిపిస్తూ హైద్రాబాద్‌కు 525క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. అయితే నిర్దేశిత లక్ష్యం మేరకు రోజుకు 800క్యూసెక్కులను తరలించేందుకు సాగర్ జలాశయంలో అప్రోచ్ కెనాల్‌ను నీటిలో మరింత దూరం లోతుకు పొడగించేందుకు డ్రెడ్జింగ్ పనులు చేపట్టారు.
నెల రోజుల పాటు కాలువ త్రవ్వకం పనులు
సాగర్ జలాశయంలో అప్రోచ్ కెనాల్‌ను నెల రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే జూరాల, శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో నీటి మట్టం పెరగాల్సివున్నా వర్షాలు లేనందున భవిష్యత్ తాగునీటి ఎద్దడి ముప్పును దృష్టిలో పెట్టుకుని మూడున్నర కోట్లతో అప్రోచ్ కెనాల్‌ను పొడిగిస్తున్నారు. 12మీటర్ల వెడల్పు, 5నుండి 7మీటర్ల లోతుకు కాలువను తవ్వనున్నారు. 0నుండి 440మీటర్ల వరకు అప్రోచ్ కెనాల్‌ను నీటిలో త్రవ్వే క్రమంలో 0నుండి 440మీటర్ల వరకు రెండు దఫాలుగా వెడల్పు పనులు నిర్వహించనున్నారు.

చిత్రం.. నాగార్జున సాగర్ జలాశయంలో ఏఎమ్మార్పీ మోటార్ల అప్రోచ్ కెనాల్ పొడిగింపు పనులు చేస్తున్న యంత్రాలు