తెలంగాణ

ఎస్పీ, సిపి కార్యాలయాలన్నిటికీ త్వరలో పక్కా భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 24 : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఎస్పీ, కమిషనరేట్ కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి మల్లారెడ్డి వెల్లడించారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిపి కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో, పోలీస్ కమిషనరేట్‌లో 25 కోట్ల రూపాయలతో డిపిఓ కార్యాలయం, సిపి కార్యాలయాలు, హెడ్ క్వార్టర్స్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. 25 నుండి 30 ఎకరాల విశాలమైన స్థలాల్లో కేటాయించినట్టు తెలిపారు. డిపిఓ కార్యాలయాలను 40వేల ఎస్‌ఎఫ్‌టిలతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా డిపిఓ కార్యాలయాలతో పాటు సిద్దిపేట, రామగుండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాల నిర్మాణాలకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. రెండవ ఫేజ్‌లో పోలీసు కానిస్టేబుళ్ల క్వార్టర్స్‌లో నిర్మించనున్నట్టు పేర్కొన్నారు.