తెలంగాణ

అన్నదాతలకు మరింత బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 24: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ రంగానికి ఈ నెల 25వ తేదీ నుండి ఉదయం వేళలోనే తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకు షిఫ్టు పద్ధతుల్లో విద్యుత్ సరఫరా జరిగేదని, ప్రస్తుతం రైతుల భద్రత, వారి శ్రేయస్సు దృష్ట్యా ఉదయం వేళలోనే కరెంటు అందించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. సోమవారం ఆయన వర్ని మండల కేంద్రంలో పర్యటించారు. తెరాస కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా సింగిల్ విండో సొసైటీ అధ్యక్షుడు నేమాని వీర్రాజు నేతృత్వంలో సుమారు వంద మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మంత్రి పోచారం సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా తెరాసలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ, తెరాస ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన అనేక మంది తెరాసలో చేరుతున్నారని, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతాంగ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ వేలాది కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే రైతులకు ఉదయం వేళలోనే తొమ్మిది గంటల పాటు విద్యుత్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేశారని చెప్పారు. త్వరలోనే సేద్యానికి 24గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేలా చర్యలు చేపడుతున్నారని మంత్రి పోచారం వివరించారు. కాగా, మహిళల సంక్షేమానికి కూడా అధిక ప్రాధాన్యతనిస్తూ, ఎన్నికల మేనిఫెస్టోలో లేని పథకాలను సైతం అమలు చేస్తున్నారని కొనియాడారు. ఏ ఒక్క పేదింటి కుటుంబం కూడా తమ ఆడపిల్లకు పెళ్లి కావడం లేదని బాధపడకూడదనే ఉద్దేశంతో షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల ద్వారా వారిని ఆదుకుంటున్నారని అన్నారు. ఆడబిడ్డల పెళ్లి కోసం ఏ పేద కుటుంబం కూడా అప్పులు చేయకూడదన్నదే తెరాస ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పథకం కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి పేద కుటుంబానికి చెందిన యువతి వివాహానికి ప్రభుత్వం 75,116రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. అంతేకాకుండా గర్భం దాల్చిన పేదింటి మహిళలకు మాతాశిశు సంరక్షణ కోసం 12వేల రూపాయలు చెల్లిస్తున్నామని, పుట్టిన శిశువు ఆలనాపాలన కోసం 2వేల రూపాయల విలువ చేసే కెసిఆర్ కిట్‌ను అందజేస్తున్నారని మంత్రి పోచారం అన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులు చేయించుకున్న తల్లీ, బిడ్డలను వారి ఇళ్లకు చేరేందుకు వీలుగా త్వరలోనే ప్రత్యేక వాహనాలను కూడా సమకూర్చాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోందని, స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి సిఎం కెసిఆర్‌ను ప్రశంసించారని పేర్కొన్నారు. మత్స్య కార్మికులకు వంద శాతం సబ్సిడీపై చేప విత్తనాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.

చిత్రం.. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న మంత్రి పోచారం