తెలంగాణ

‘్ఫదా’కి సిఎం అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: అధికారిక కార్యక్రమాలు, శాఖల వారీగా సమీక్షలతో నిత్యం బిజీగా ఉండే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఒక సినిమా చూశారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్ సారధ్యంలో నిర్మించిన ‘్ఫదా’ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి కథాంశంగా లవ్ ఎంటర్‌టైనర్‌ను అద్భుతంగా తెరకెక్కించారని ముఖ్యమంత్రి అభినందించారు. హీరోయిన్‌గా నటించిన సాయి పల్లవి పాత్రకు అధ్యంతం తెలంగాణ యాసలో డైలాగ్‌లు పెట్టడంతో ఈ సినిమా మరింత తనను ఆకట్టుకుందని ముఖ్యమంత్రి పేర్కొన్నట్టు నిర్మాత దిల్‌రాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభ, నటి నటుల చక్కని అభినయాన్ని ముఖ్యమంత్రి అభినందించినట్టు దిల్‌రాజు పేర్కొన్నారు. నిర్మాత, దర్శకుడు ఇద్దరూ వీలు చూసుకుని వచ్చి తనను కలవాల్సిందిగా ముఖ్యమంత్రి సమాచారం పంపించినట్టు నిర్మాత టిట్టర్‌లో వెల్లడించారు.