తెలంగాణ

ఘనంగా కెటిఆర్ జన్మదిన వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: తెలంగాణ ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌కు గవర్నర్ నరసింహన్ సహా పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రాజ్‌భవన్ నుంచి మంత్రి కెటిఆర్‌కు గ్రీటింగ్‌తో పాటు అద్భుతమైన పూల మొక్కను బహుమానంగా పంపించారు. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. ఇందుకు గవర్నర్ నరసింహన్‌కు మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి, సిఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కూడా కెటిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని లోకేశ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. లోకేశ్ ట్వీట్‌కు స్పందించిన కెటిఆర్ తన ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ, ఎపి రాష్ట్రాలు రెండూ పరస్పరం కలిసి పని చేద్దామని కెటిఆర్ అన్నారు. హీరోయిన్, తెలంగాణ చేనేత ప్రచార కర్త సమంత మంత్రి కెటిఆర్‌కు తన ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘అత్యంత ప్రియమైన నాయకుడికి శుభాకాంక్షలు, నిజమైన స్ఫూర్తి, నమ్మకం కలిగించే మీతో పరిచయం ఏర్పడడం గౌరవంగా భావిస్తున్నా సర్..’ అంటూ సమంత ట్వీట్ చేసింది. సమంత ట్వీట్‌కు స్పందించిన కెటిఆర్ అంకితభావంతో పని చేస్తున్న చేనేత ప్రచార కర్తకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. త్వరలో జరిగే చేనేత వస్త్రాల ఫ్యాషన్ షో కోసం ఎదురు చూస్తున్నాని మంత్రి అన్నారు.