తెలంగాణ

వెంకయ్యకు ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: ఎన్‌డిఎ ఉప రాష్టప్రతి అభ్యర్ధి ఎం వెంకయ్యనాయుడుకు గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో అఖండ స్వాగతం లభించింది. మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో బిజీ బిజీగా వెంకయ్యనాయుడు గడపనున్నారు. చెన్నై నుండి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న వెంకయ్యనాయుడుకు ఉప రాష్టప్రతికి లభించే స్వాగతం తరహాలోనే పార్టీ నేతలు అఖండ స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం వెలుపల ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్దకు వెంకయ్య చేరుకోగానే ఇరు వైపులా పార్టీ నేతలు నిల్చుని ఉండగా ఒకొక్కరి వద్దకు ఆయన వచ్చి పలకరించారు. పార్టీ సీనియర్ నేతలు, వివిధ మోర్చల నాయకులు, జిల్లాల అధ్యక్షులు ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. విమానాశ్రయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ స్వాగతం పలుకగా వెలుపల వేదిక వద్ద శాసనసభ నేత జి కిషన్‌రెడ్డి, శాసనమండలి నేత ఎన్ రామచంద్రరావు సహా వందలాది మంది హాజరయ్యారు. గురువారం సాయంత్రం పార్టీ నేతలు అంతా వెంకయ్య నివాసానికి చేరుకుని వ్యక్తిగతంగా అభినందనలు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన ఇమేజ్ గార్డెన్స్ జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుండి 10 గంటలకు స్వర్ణ్భారతి ట్రస్టులో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు సమకూర్చే కార్యక్రమంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆయన సాయంత్రం 4 గంటలకు మే ఫెయిర్ కనె్వన్షన్ హాల్‌లో జరిగే అభినందన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఆయన నగరానికి చెందిన పలువురు ప్రముఖులతో సంభాషిస్తారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ భారత ఉప రాష్టప్రతి పదవికి నామినేషన్ వేసిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఘన స్వాగతం పలికినట్టు చెప్పారు. ఉప రాష్టప్రతి అభ్యర్ధిగా వెంకయ్యనాయుడు పార్టీలకు , రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తి కనుక గతంలో తామంతా కలిసి పనిచేసిన నేతగా బిజెపి తరఫున పెద్ద సంఖ్యలో అంతా వచ్చి కలిశారని డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. ఒక తెలుగువాడు ఆ స్థాయికి ఎదిగినందుకు గర్వపడాలని, కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా జైరాం రమేష్ లాంటి వారు ఉత్తరాది వారని, దక్షిణాది వారని ఆరోపణలు చేస్తున్నారని, వెంకయ్యనాయుడు ఎదగడాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని అర్ధం అవుతోందని అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్న వ్యాఖ్యలను మానుకోవాలని అన్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదని పేర్కొన్నారు.
ఎక్కడ లేని విషయాలను తెరమీదకు తెచ్చి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, వెంకయ్య మంచి మెజార్టీతో ఉపరాష్టప్రతిగా ఎన్నిక కావడం ఖాయమని లక్ష్మణ్ అన్నారు. ఉప రాష్టప్రతి ఎన్నిక నల్లేరు మీద నడక వంటిదని, ఇది కేవలం లాంఛనమేనన్నది మరిచిపోయి కాంగ్రెస్ నాయకులు చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. రాజకీయ విమర్శలు చేయడం సబబైనా, రాజ్యాంగ పదవికి సంబంధించి మాట్లాడటం దారుణమని చెప్పారు. ఉప రాష్టప్రతి ప్రచారానికి రాలేదని, మర్యాదపూర్వకంగానే పార్టీ నేతలు స్వాగతం పలికారని అన్నారు. దేశానికి సేవలు చేయడానికి వెంకయ్య నాయుడుకు కొత్త హోదాలోకి వస్తున్నారని, తద్వారా ఆయన అందరికీ న్యాయం చేస్తారని, అనుభవం ఉన్న వారే కనుక రాజ్యసభ చైర్మన్‌గా రాణిస్తారని అన్నారు. పార్టీ పదవులు, మంత్రి పదవులు గురించి చర్చించే సమయం కాదని, మన ప్రాంతానికి చెందిన వారు కనుక ఉప రాష్టప్రతి పదవికి ఎన్నిక కాబోవడాన్ని తాము గర్వపడుతున్నామని, ఉప రాష్టప్రతి హోదాలో మరోమారు తాము స్వాగతం పలుకుతామని అన్నారు.

చిత్రాలు.. బేగంపేట విమానాశ్రయంలో గురువారం ఎన్డీఏ ఉప రాష్టప్రతి అభ్యర్థి
వెంకయ్యనాయుడుకు శాలువా కప్పి స్వాగతం పలుకుతున్న బిజెపి నేతలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి