తెలంగాణ

నేరెళ్ల ఘటనకు నిరసనగా 31న చలో సిరిసిల్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 27: రాష్ట్రంలో అధికార పార్టీ విచ్చలవిడినతంతో వ్యవహరిస్తోందని, అధికారం ఉందనే అహంతో సమస్యలను ప్రస్తావిం చే ప్రతిపక్షాలపై తిట్లదండకానికి దిగటం, ప్రతిపక్ష పార్టీల నాయకులపై వేధింపులకు పాల్పడటం, కేసులు నమోదు చేయటం షరామామూలు కార్యక్రమంగా మారిపోయిందని రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. అధికారులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని , టిఆర్‌ఎస్‌కు అధికారం శాశ్వతం కాదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, అప్పుడు ఏమి జరుగుతుందో ఆలోచించుకోవాలని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు, పోలీసుల దౌర్జన్యాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 31న ఛలో సిరిసిల్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి లో కసభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. వరంగల్ పర్యటన సందర్భంగా గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పిసిసి అధ్యక్షు డు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాసమస్యలపై ప్రశ్నించే, పార్టీలో క్రియాశీలం గా వ్యవహరించే కాంగ్రెస్ నాయకులను ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని చెప్పారు. వరంగల్ జిల్లాలో డిసిసి అధ్యక్షునిపై హత్యకేసు నమోదు చేయటం, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్‌ను పదవినుంచి తప్పించే ప్రయత్నం చేయ టం, మాజీ చీఫ్ విప్‌ను ఇబ్బందులకు గురిచేయటం అందులో భాగమేనని ఆరోపించా రు. కార్పొరేటర్‌ను హత్యచేసిన నిందితులు ఇంటరాగేషన్‌లో చెప్పారనే నెపంతో పోలీసులు డిసిసి అధ్యక్షునిపై కేసు నమోదు చేయటం హాస్యాస్పదమని, నిందితులు అధికార పార్టీ నాయకుల పేరు, పోలీసు అధికారి పేరు చెబితే వారిపైన కూడా కేసు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. హత్య కేసు నిందితులు గత డిసెంబర్ నెలలో డిసి సి అధ్యక్షడిని కలిసినట్లు, అప్పుడే హత్యకు కుట్ర జరిగి ఉంటుందని పోలీసులు అనుమానించడాన్ని తప్పుపడుతూ అంతకు కొద్ది రోజుల ముందే రోడ్డు ప్రమాదంలో కుమారుడు మరణించిన శోకంతో ఉన్న డిసిసి అధ్యక్షుడు హత్యల గురిం చి ఆలోచిస్తారా అని ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిడులకు లోనవకుండా పోలీసులు నిజాయితీతో విచారణ జరపాలని ఆయన కోరారు. అధికార పార్టీ ముఖ్యుల అండతో రాష్ట్రంలో ఇసుక మాఫియా విచ్చలవిడిగా వ్యవహరిస్తోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.. ఓవర్‌లోడ్, ఓవర్ స్పీడ్‌తో వెడుతున్న వాహనాల కారణంగా నేరెళ్ల ప్రాంతం లో రోడ్లు దెబ్బతినటంతోపాటు వాహనాల కిందపడి కొందరు వ్యక్తులు మరణించిన నేపథ్యంలో ఆగ్రహం తో ఇసుక లారీని తగులబెడితే మనుషుల ప్రాణాలుపోతే పట్టించుకోని, చట్టపరంగా చర్యలు తీసుకోవలసిన పోలీసులు అమానుషంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు.