తెలంగాణ

కోర్టు భవనం ఎక్కి మహిళ హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ లీగల్, జూలై 27: భూవివాదంలో తన కేసును నీరుగార్చే రీతిలో వ్యవహరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తు వేధింపులకు పాల్పడుతున్న కోర్టు బెంచ్ క్లర్క్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం నల్లగొండ జిల్లా కోర్టులో ఓ మహిళ భవనంపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నంతో హల్‌చల్ సృష్టించింది. హుజూర్‌నగర్‌కు చెందిన కనె్నబోయిన లక్ష్మి నల్లగొండ కోర్టు ఆవరణలో నిర్మాణంలో ఉన్న కోర్టు భవనం మూడవ అంతస్తు పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. లక్ష్మి ఆత్మహత్యా యత్నం గమనించిన కోర్టు ఉద్యోగులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, కక్షిదారులంతా భవనం వద్దకు చేరుకున్నారు. పోలీసులు ఆమె సమస్యలు తెలుసుకొని కిందికి దిగి రావాలంటూ కోరారు. తనను హుజూర్‌నగర్‌లో ఇబ్బందులు పెట్టి ప్రస్తుతం నల్లగొండ కోర్టులో పనిచేస్తున్న బెంచ్ క్లర్క్ గోవర్ధన్‌ను సస్పెండ్ చేసే వరకు తాను కిందికి రానంటూ భీష్మించుకుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది లక్ష్మి ఎక్కడ కిందకు దూకుతుందోనన్న ఆందోళనతో ముందస్తుగా ఆమెను రక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. గంటన్నర పాటు సాగిన హైడ్రామా పిదప చివరకు జిల్లా జడ్జి డి.తిరుమలరావు అక్కడికి చేరుకుని లక్ష్మితో మాట్లాడి ఆమె సమస్యను పరిష్కరిస్తామని, గోవర్ధన్‌పై విచారణ చేసి అవసరమైతే సస్పెండ్ చేస్తానంటు హామీ ఇచ్చారు. జడ్జీ హామీతో శాంతించిన లక్ష్మి ఆత్మహత్య యత్నం విరమించి భవనంపై నుండి కిందకు దిగి రావడంతో ఉత్కంఠతకు తెరపడింది. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతు హుజూర్‌నగర్ కోర్టులో నడుస్తున్న తన భూవివాదం కేసును బెంచ్‌పై పెట్టేందుకు బెంచ్ క్లర్క్ గోవర్ధన్ తన వద్ద పలు దఫాలుగా 30 వేలు లంచం తీసుకొని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపింది. పదేపదే డబ్బులు అడుగుతుండటంతో తనకు అంత స్థోమత లేదని చెప్పడంతో వ్యక్తిగతంగా తనను వేధింపుల పాలు చేస్తున్నాడని లక్ష్మి వాపోయింది. ఈ వివాదంలో గోవర్ధన్‌పై చర్యలు తీసుకోకుండా కేవలం బదిలీ చేయడంతో తనకు న్యాయం జరుగలేదంటూ కన్నీరు పెట్టుకుంది. ఆమె సమస్యలు విన్న జిల్లా జడ్జి తిరుమల్‌రావు మాట్లాడుతు కోర్టు ఉద్యోగులపై ఏమైనా అభియోగాలు ఉంటే తనకు తెలియజేస్తే చర్యలు తీసుకుంటానన్నారు. ఇప్పటికే ఈ సమస్యపై గోవర్ధన్‌ను హుజూర్‌నగర్ కోర్టు నుండి నల్లగొండ కోర్టుకు బదిలీ చేశామన్నారు. శాఖాపరమైన విచారణ జరుపుతున్నామని లక్ష్మి వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని తెలుపాలంటు సూచించారు. సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదన్నారు. అనంతరం లక్ష్మికి కౌన్సిలింగ్ నిర్వహించేందుకు నల్లగొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

చిత్రాలు.. నల్లగొండ కోర్టు భవనంపై ఎక్కిన లక్ష్మి, లక్ష్మిని భవనంపై నుండి కిందకు రావాలంటూ నచ్చచెబుతున్న పోలీసులు, జిల్లా జడ్జి