తెలంగాణ

బిజెపికి వ్యతిరేకంగా లౌకిక పార్టీలు ఏకం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 27 : దేశంలోని లౌకిక వాద పార్టీలు ఏకపై మత తత్వ పార్టీ బిజెపికి బుద్ది చెప్పాలని ఏఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపి వి.హ న్మంత్‌రావు పిలుపునిచ్చారు. బీహార్ లో లాలు ప్రసాద్‌పై కేంద్ర సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విహెచ్ ఆరోపించారు. గురువారం సిద్దిపేట జిల్లా పొన్నాల వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీహార్ ఎన్నికల ముందు మతతత్వ పార్టీ బిజెపికి వ్యతిరేకంగా సెక్యులర్ పార్టీ ల నాయకులైన కాంగ్రెస్ సోనియాగాంధీ, ఆర్‌జెడి నేత లాలుప్రసాద్ యాదవ్, జెడియు నేత నితీష్‌కుమార్‌లు కలసి మహాకూటమిగా ఏర్పడ్డారన్నారు. బీహార్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించారని, అందరి కంటే ఎక్కువగా ఆర్‌జెడి లాలుప్రసాద్ యాదవ్‌కు అధిక సీట్లు వచ్చాయని, కాని సిఎంగా నితీష్‌కుమార్‌ను ఎంపి క చేశారన్నారు. మహాకూటమి ఎన్నికల ఒప్పందంలో భాగంగానే నితీష్ ను సిఎంగా ప్రకటించారన్నారు. బీహా రీ ప్రజలు ఐదేళ్ల పాలన కోసం నితీష్‌ను సిఎంగా అవకాశం వస్తే బిజెపి మాయలో పడి నితీష్ సిఎం పదవికి రాజీనామా చేశారన్నారు. బిజెపితో పొతు పెట్టుకొని అనాలోచిత నిర్ణయంతో వైదొలగి...తిరిగి సిఎంగా పదవిని చేపట్టేందుకు పావు లు కదుపుతున్న నితీష్‌కుమార్‌ను భవిష్యత్తులో ప్రజలు క్షమించరన్నారు. లాలుప్రసాద్ యాదవ్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు కక్ష కట్టిన కేంద్ర సర్కార్ సిబిఐచే దాడు లు చేయిస్తోందన్నారు. కేంద్ర సర్కార్ కేబినెట్‌లో ఉన్న మంత్రులు నితీష్ గడ్కారి, అరుణ్‌జైట్లి, సుష్మాస్వరాజ్, సుజనాచౌదరి, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ చౌహాన్‌పై ఆవినీతి ఆరోపణలు వస్తే ఎందుకు చర్యలు చేపట్టలేదని, వారితో ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. లౌకికవాద శక్తులను ఏకం చేసే శక్తి లాలుప్రసాద్ యాదవ్‌కు ఉందని.. అందుకే లాలు కుటుంబంపై కేంద్ర సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. లాలుప్రసాద్‌ను దెబ్బతీస్తే సెక్యులర్ పార్టీలను దెబ్బతీయవచ్చని భావించారు. ప్రధాని నరేంద్ర మోదీ నీతివ్యాఖ్యలు, నైతిక విలువల గూర్చి చెపుతారని, తన మంత్రి వర్గంలోని అవినీతి పరులను కాపాడుతారని ఇదేం న్యాయం, నైతికత ప్రశ్నించారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏఐసిసి కార్యదర్శి వి.హన్మంతరావు