తెలంగాణ

గత ప్రభుత్వాలే భ్రష్ఠుపట్టించాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 27 : గత ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యాలయాలను, వైద్యాలయాలను భ్రష్టు పట్టిం చి..నిర్వీర్యం చేసి ...ప్రైవైటు రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాయని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మం త్రి హరీష్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ విద్యాలయా ల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవటంతోపాటు ఇబ్బడి..ముబ్బడిగా ప్రైవేటు పాఠశాలలకు, కళాశాలలకు అనుమతులిచ్చి ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించారన్నారు. దీంతో విద్యార్థులు సర్కార్ బడులంటే చిన్నచూపుగా మారాయన్నారు. తెలంగాణ సర్కార్ అధికారంలోకి వచ్చాక విద్యారంగానికి అధిక ప్రాధాన్యత కల్పించి ప్రభుత్వ రంగ విద్యాసంస్థలకు బలోపేతం చేసి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషిచేస్తున్న ట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మహిళ డిగ్రీ కళాశాలల్లో అదనపు తరగతులను ప్రారంభించారు. ఆనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యా రంగానికి అధిక ప్రాధాన్యత కల్పించటంతో పాటు పెద్దఎత్తున ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసిందన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి పక్క భవనాలతో పాటు వౌలిక సదుపాయాలు కల్పించిందన్నారు. తెలంగాణ సర్కార్ కెజి నుండి పీజీ వరకు ఉచిత విద్యను అం దించటంలో భాగంగా పెద్దఎత్తున కస్తుర్భా పాఠశాలలు, ఎస్సీ, బిసి, మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్సీ, బిసి, ఎస్టీ రెసిడెన్సియల్ మహిళ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బాలికల కోసం ప్రత్యేక హాస్టళ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు మంచి ఫ్యాకల్టీని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేటలో 700 కోట్లతో మెడికల్ కళాశాల అన్ని హంగులతో నిర్మాణమవుతుందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి మెడికల్ కళాశాల ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటుతో పాటు ఈప్రాంత ప్రజలకు మంచి వైద్యం అందుతుందన్నారు. అలాగే అన్ని సర్కార్ ఆసుపత్రులను సైతం కోట్లాది రూపాయలతో వౌలిక సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ దీటుగా వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రభు త్వ విద్యాసంస్థలు, వైద్యాలయాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆనంతరం విద్యార్థులు,వారి తల్లిదండ్రులతో కలసి సహాపంక్తి భోజనం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి, మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భవాణి, వైస్ ప్రిన్సిపాల్ రుక్సాన, అధ్యాపకులు హరినాథశర్మ, సువర్ణ,గోదావరి పాల్గొన్నారు.

చిత్రం.. సిద్దిపేట మహిళ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతులు ప్రారంభిస్తున్న మంత్రి హరీష్‌రావు