తెలంగాణ

మన పోలీసులే నెంబర్ 1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, జూలై 27: తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని పొందారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలంగాణలో పర్యటించిన సందర్భంలో తెలంగాణ పోలీసుల సేవలను మెచ్చుకుంటూ వీరి సేవలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని అన్నారని తెలిపారు. ప్రభుత్వం సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదువేల కోట్లతో సంక్షేమ పథకాలను చేపట్టిన ఘనత సిఎం కేసిఆర్‌కే దక్కుతుందన్నారు. మైనార్టీలకు 200, బిసిలకు 119, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక గురుకులాలను ఏర్పా టు చేసి ఆయా వర్గాలకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. పోలీస్ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొని వస్తూ తెలంగాణ పోలీస్ హౌసింగ్ సొసైటీ ద్వారా రాష్ట్రంలో ఒక్కొక్క భవనానికి రూ. 2కోట్ల వ్యయంతో 48 పోలీస్ స్టేషన్లను నిర్మించినట్టు తెలిపారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజల సమస్యలే ఏజెండా అని వారి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్, బిజెపి, కమ్యూనిస్టులకు హై కమాండ్ ఢిల్లీలో ఉంటాయని, విధానపరమైన నిర్ణయాలు వారి కన్నుసైగల మధ్య జరుగుతాయని, ఉద్యమ పార్టీ టిఆర్‌ఎస్‌కు ప్రజలే హైకమాండ్ అన్నారు. సిఎం కేసిఆర్ వచ్చే పదేళ్ల వరకు సిఎంగా ఉంటారని, అతన్ని ఓడించే దమ్ము ధైర్యం ఏ పార్టీకీ లేదన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నీ రంగాలలో అభివృద్ధి చెందేందుకు నిర్ధిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు పోతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ నల్లమలలో పోలీస్ బెటాలియన్‌ను ఏర్పాటు చేయాలని, అచ్చంపేటకు డిఎస్పీ పోస్టును మంజూరు చేయాలని, పోలీస్ క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకున్నందున వాటి స్థానంలో కొత్తవాటిని నిర్మించాలని కోరారు. అంతకుముందు అచ్చంపేట, సిద్దాపూర్ పోలీస్ స్టేషన్లను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ సొసైటీ ఎండి మల్లారెడ్డి, అదనపు డిజిపి అంజనీకుమార్, పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ దామోదర్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్, ఏఎస్పీ అనసూయ, డిఎస్పీ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.

చిత్రం.. అచ్చంపేటలో పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభిస్తున్న హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి