తెలంగాణ

సింగపూర్ ఎన్‌టియులో పరిశోధనలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: సింగపూర్ నాన్‌యాంగ్ టెక్నాలజికల్ యూనివర్శిటీ (ఎన్‌టియు) పరిశోధనలకు పెద్ద పీట వేస్తోందని, భారతీయ విద్యార్ధులను దృష్టిలో ఉంచుకుని ఎన్‌టియు ఇండియా కనెక్టు పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు యూనివర్శిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి వి ఆర్ చౌదరి తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన శుక్రవారం నాడు పాల్గొన్నారు. ఫ్యాకల్టీ సభ్యులతో మాట్లాడుతూ ప్రస్తుతం తమ వర్శిటీలో 33వేల మంది విద్యార్ధులున్నారని, జలం, ఇంధనం, ఆరోగ్య సంరక్షణ అంశాలపై ప్రధానంగా పెద్ద ఎత్తున పరిశోధనలకు తాము ప్రోత్సహిస్తున్నామని, ఈ రంగాలపై ఆసక్తి ఉన్న విద్యార్ధులు తమ వర్శిటీలో చేరవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో విసి ప్రొఫెసర్ పి అప్పారావు , ప్రో విసి ప్రొఫెసర్ పి ప్రకాష్ బాబు, డీన్ ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
రేపు రాష్టవ్య్రాప్త నిరసన: ఎస్‌ఎఫ్‌ఐ
ప్రైవేటు విద్యార్థి సంస్థల్లో అదనపు ఫీజులు నియంత్రించాలని పేర్కొంటూ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై పోలీసులు లాఠీ ఛార్జి చేయడం హేయమైన చర్య అని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎం నాగేశ్వరరావు, కోట రమేష్‌లు పేర్కొన్నారు. పోలీసుల చర్యను ఖండిస్తూ శనివారం నాడు రాష్టవ్య్రాప్త నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వారు చెప్పారు.
బైపిసి వెరిఫికేషన్‌కు 9190 మంది
ఎమ్సెట్ బైపిసి విభాగంలో సర్ట్ఫికేట్ల పరిశీలనకు 32001 నుండి 53వేల ర్యాంకు వరకూ అభ్యర్ధులను పిలవగా, అందులో మొత్తం 9190 మంది సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరయ్యారు. ఉస్మానియా నుండి 9015 మంది, ఎయు నుండి 84 మంది, ఎస్వీయు నుండి 59 మంది, నాన్‌లోకల్ అభ్యర్ధులు 32 మంది హాజరయ్యారని కన్వీనర్ వాణి ప్రసాద్ తెలిపారు. ఇందులో 2293 మంది తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేశారని వివరించారు.
అన్ని జిల్లాల్లో శతాబ్ది ఉత్సవాలు
ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు అన్ని జిల్లాల్లో నిర్వహించాలని, ఏడాది పొడవునా ఈ కార్యక్రమాలు జరగాలని యూనివర్శిటీ విసి ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం పేర్కొన్నారు. ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ కె వెంకటాచలం, ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విసి మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాలకు ప్రతిష్ట తీసుకురావాలని అన్నారు. జనవరిలో జరిగే సైన్స్ కాంగ్రెస్‌లో అంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన చెప్పారు.