తెలంగాణ

రెవెన్యూశాఖలో సిబ్బంది కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అస్తవ్యస్తంగా ఉన్న భూముల రికార్డులను సరి చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసినా ఫలితం కనిపించడం లేదు. రెవెన్యూ శాఖలో వివిధ కేటగిరీల సిబ్బంది కొరత ఉండడంతో ఈ ఉద్దేశం నీరుగారుతోంది. రెవెన్యూ శాఖ వద్ద సరైన భూముల రికార్డులు లేకపోవడంతో రికార్డులను సరిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క రెవెన్యూ శాఖలోనే 39,805 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా వివిధ కేటగిరి పోస్టుల్లో సుమారు 6 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాతైతే కొన్ని గ్రామాల్లో అసలు విఆర్వోలు లేనే లేరు. గ్రామాల్లో ఈ ఉద్యోగుల కొరత కారణంగా సరిహద్దులు నిర్ణయించే సర్వేయర్లు, వారికి సహకరించే విఆర్వోలు లేరు. సర్వేయర్లు ఎంత నిబద్దతగా పని చేసినా నెలకు 20 సర్వేలకు మించి చేయలేరు. చాలా సందర్భాల్లో లావాదేవీలు టెటిల్ పుస్తకాలు లేకుండానే జరుగుతున్నాయి. దీని వల్ల రెవెన్యూ రికార్డుల్లో డూప్లికేషన్ అవడం, తద్వారా నకిలీ రికార్డులు బయటకు రావడం, ఒకటికి రెండుసార్లు రుణాలు తీసుకోవడం వంటి అక్రమాలకు అవకాశం కలుగుతోంది. సిబ్బంది కొరత వల్ల చనిపోయిన వారి వివరాలను రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించడం కూడా సాధ్యం కావట్లేదు. జిల్లాల్లో పంటల పరిస్థితికి సంబంధించిన డాటాను సేకరించడం చాలా కష్టతరంగా మారింది. దీని వల్ల సమాచారాన్ని సేకరించకుండానే అంతకు ముందు సంవత్సరం ఉన్న డేటానే యథావిధిగా ప్రచురిస్తున్నట్లు తేలింది. రెవెన్యూ రికార్డులు అప్‌గ్రేడ్ కాకపోవడం వల్ల పట్టాదారు పాస్‌పుస్తకం ఒకరి పేరుతో ఉంటే, వేరొకరు రుణాలు, ఇతరత్రా ప్రయోజనాలను పొందుతున్నారు. దీంతో పట్టాదార్ పాస్‌పుస్తకాలకు, ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి చేశారు. ఆధార్ లింక్ చేసేందుకు కూడా సిబ్బంది లేకపోవడంతో నానా ఇబ్బందిపడుతున్నారు.