తెలంగాణ

రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 4: దీర్ఘకాలికంగా ఉన్న రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కరించక పోతే దేశ వ్యాప్త సమ్మె చేపడతామని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే జాతీ య ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య హెచ్చరించారు. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయాస్ సంఘ్ డివిజనల్ కాన్ఫరెన్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సోమవారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. భారత రైల్వేలలో 13లక్షల 16వేల కార్మికులు పని చేస్తున్నారని, ప్రతి రోజు భారత రైల్వేలలో 21వేల రైళ్లు నడుస్తున్నాయని, ఏటా 1100 మిలియన్ టన్లు సరుకు రవాణా చేస్తూ దేశానికే వెన్నుముక లాంటి రైల్వేలో పని చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

విలేఖరుల సమావేశంలో ఎం.రాఘవయ్య