తెలంగాణ

టిడిపి లేకుండా చేస్తా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొర్రూరు, ఏప్రిల్ 4: రానున్న కొద్దిరోజుల్లోనే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా సమూలంగా భూస్థాపితం చేస్తానని ఈ మేరకు టిఆర్‌ఎస్ నాయకత్వం ప్రత్యేక బాధ్యతలు అప్పగించిందని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా తొర్రూరులో నిర్వహించిన టిఆర్‌ఎస్ మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మూడు నెలల పాటు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటానని, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగ అన్ని జిల్లాల్లో పర్యటించి తెలంగాణలో టిడిపిని లేకుండా చేస్తానని అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకత్వం తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వహించేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నానని అన్నారు. తాను తన వ్యక్తిగత స్వార్థం కోసం ఎలాంటి పదవులు ఆశించకుండా పాలకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, బంగారు తెలంగాణ నిర్మాణం కోసమే తెలంగాణలో టిడిపి టిఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ కెసిఆర్ నాయకత్వంలో తెరాసలో చేరడం జరిగిందన్నారు. ఇప్పటివరకు తన కష్టపడి పనిచేసిన కార్యకర్తల రుణం తప్పకుండా తీర్చుకుంటానని అన్నారు. రాను న్న రోజుల్లో కార్యకర్త దిశానిర్ధేశం మేరకే పనిచేస్తానని అన్నారు. గత శాసనసభ ఎన్నికల ముందే టిఆర్‌ఎస్‌లో చేరాలని తనపై ఒత్తిడి ఉన్నప్పటికీ టిడిపికి అన్యాయం చేయవద్దనే ఉద్దేశంతో పార్టీ లో చేరలేదన్నారు. అయితే, ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో టిడిపి స్థానం లేదని స్పష్టం కావడంతో విధిలేని పరిస్థితుల్లో టిడిపిని టి ఆర్ ఎస్‌లో వీలినం చేయడం జరిగిందన్నారు. అభివృద్ధే లక్ష్యంగా పార్టీలో అన్ని వర్గాలను కలుపుకుని పనిచేస్తానని అన్నా రు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం మేరకు నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట కోసం ఎమ్మెల్యే ఎర్రబెల్లితో కలిసి పనిచేస్తానని అన్నారు. రాజకీయాల్లో త్యాగాలు తనకు కొత్తేమీ కాదని గతంలో కూడా ఎర్రబెల్లి కోసం త్యాగం చేసిందని పార్టీ శ్రేణులకు తెలుసునని అన్నారు. నామినేటేడ్ పదవుల పంపకాల్లో తెలంగాణ ఉద్యమకారులకు, అన్ని వర్గాల నాయకులకు ప్రాధాన్యత ఇచ్చి పంపిణీ చేస్తానని అన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతముందు మండలంలోని మడిపెల్లి గ్రామం లో గ్రామ మాజీ సర్పంచ్ రామసహాయం కిశోర్‌రెడ్డి నాయకత్వంలో సుమారు 1000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి దయాకర్‌రావు, సుధాకర్‌రావుల సమక్షంలో పార్టీలో చేరారు.