తెలంగాణ

పెరిగిన పరపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎఫ్‌ఆర్‌బిఎం పెంపునకు కేంద్రం నిర్ణయం అదనంగా 2300 కోట్ల రుణానికి అవకాశం
14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు ఆమోదం ఫలించిన ముఖ్యమంత్రి కెసిఆర్ యత్నం

మిగులు బడ్జెట్ రాష్టమ్రైన తెలంగాణకు ద్రవ్య నిర్వహణ పరపతి పెంచాలంటూ కొద్దికాలంగా సర్కారు చేస్తున్న డిమాండ్‌కు ఎట్టకేలకు కేంద్రం ఒకే చెప్పింది. 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల్లో భాగంగా ఎఫ్‌ఆర్‌బిఎం రుణ పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచడానికి బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయంచడంతో రాష్రా టనికి ఏటా 2.3వేల కోట్ల అదనపు రుణం దక్కే అవకాశం ఉంది. 2020 వరకూ నాలుగేళ్లపాటు ఏటా ఈమేరకు
నిధులు అందుతాయ.

హైదరాబాద్, ఏప్రిల్ 6: రుణ పరపతి పెంచాలని ఏడాది కాలంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. రెండేళ్లుగా మిగులు బడ్జెట్ కలిగిన తమ రాష్ట్రానికి ఎఫ్‌ఆర్‌బిఎం (ద్రవ్య నిర్వహణ, పరపతి పెంపు) పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి పెంచాలని 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసుకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి రూ. 2300 కోట్ల రుణాన్ని అదనంగా పొందడానికి అవకాశం కలిగింది. రెండేళ్లుగా తమ రాష్ట్రం మిగులు బడ్జెట్ కలిగి ఉండటంతో ఎఫ్‌ఆర్‌బిఎం రుణ పరిమితి పెంచాలంటూ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిసి సిఎం కె చంద్రశేఖర్‌రావు చర్చించారు.
అంతకుముందు ప్రధానికి, ఆర్థిక మంత్రికి కూడా లేఖలు రాశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో కూడా ఈ అంశాన్ని తెరాస ఎంపీలు లేవనెత్తారు. దీంతో కేంద్ర మంత్రివర్గం స్పందించి మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బిఎం రుణ పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచాలని నిర్ణయించింది. దేశంలో మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రాలు తెలంగాణ, గుజరాత్ రెండే. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణకు అదనంగా రూ.2300 కోట్ల నుంచి రూ. 3000 కోట్లు రుణం పొందడానికి అవకాశం ఏర్పడింది.
14వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసు మేరకు పెంచిన ఎఫ్‌ఆర్‌బిఎం శాతం 2015 నుంచి 2020 వరకు వర్తిస్తుంది. అయితే ఇప్పటికే 2015-16 ఆర్థిక సంవత్సరం ముగిసిపోవడంతో మిగిలిన నాలుగేళ్ళపాటు అంటే 2020 వరకు అదనంగా రుణాన్ని పొందడానికి అవకాశం కలిగింది. ఏడాదికి సుమారు రూ. 3 వేల కోట్ల చొప్పున నాలుగు ఏళ్ళలో రూ. 12 వేల కోట్ల రుణం పొందడానికి అవకాశం ఏర్పడింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభలో ఈ అంశాన్ని సిఎం కెసిఆర్ ప్రస్తావించారు. నాలుగు వాయిదాల్లో పంట రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు మూడు వాయిదాలలో రూ.4250 కోట్ల చొప్పున పంట రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది. రెండు వాయిదాల్లో రూ. 8500 కోట్లు మాఫీ చేసిన ప్రభుత్వం మూడవ విడత మాఫీకి ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో నిధులను కేటాయించింది. నాలుగవ విడత పంట రుణాన్ని కూడా మాఫీ చేయాలని శాసనసభలో విపక్షాలు డిమాండ్ చేశాయి.
ఎఫ్‌ఆర్‌బిఎం రుణ పరిమితి పెంచినట్టు అయితే రాష్ట్రానికి రూ.2800 కోట్ల నుంచి రూ. 3000 కోట్ల వరకు నిధులు వస్తాయని, కేంద్రం నిర్ణయం తీసుకుంటే నాలుగవ వాయిదా పంట రుణాన్ని కూడా చెల్లిస్తామని ముఖ్యమంత్రి శాసనసభలోప్రకటించారు. ఎఫ్‌ఆర్‌బిఎం రుణ పరిమితి పెరగటం వల్ల పంట రుణాన్ని పూర్తిగా చెల్లించడానికి వెసులుబాటు లభించింది.