తెలంగాణ

ప్రజా వైద్యంపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: ప్రజా వైద్యాన్ని మెరుగుపర్చడానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించడంతో ఇక నుంచి ప్రభుత్వ వైద్యశాలల పనితీరులో గణనీయమైన మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దీంట్లో భాగంగా రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 2400 పోస్టులను భర్తీ చేయాల్సిందిగా తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజా వైద్యాన్ని మెరుగుపరిచే అంశంపై చర్చించడానికి రాష్టవ్య్రాప్తంగా ఉన్న మెడికల్ ఆఫీసర్లతో స్వయంగా సమావేశం కానున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం వైద్యశాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ఆ శాఖ కమిషనర్ బుద్ద ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమణితో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజా వైద్యాన్ని మెరుగు పర్చడానికి బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించడంతో పాటు ఆస్పత్రుల సూపరిటెండెంట్లకు అధికారాలు, నిధుల బదలాయింపు జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకు సూపరింటెండ్లకు ఆస్పత్రుల నిర్వహణ కు నిధులు ఖర్చు చేసే విచక్షణాధికారం ఇవ్వాలన్నారు. అన్ని ఆస్పత్రులలో కొత్త బెడ్స్, బెడ్‌షీట్స్, పరుపులను వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులంతా పేదలే కావడంతో వారికి అన్నిరకాల మందులను ఆస్పత్రిలోనే ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మందుల కొనుగోలు అధికారం ఆస్పత్రి సూపరింటెండ్లకు, మెడికల్ ఆఫీసర్లకే అప్పగించాలని ఆదేశించారు. మందుల కొనుగోలు కోసం రాష్టస్థ్రాయిలోనే రేటు కాంట్రాక్టు ఖరారు చేయాలన్నారు. తక్కువ రేటుకు వస్తాయని ఎట్టిపరిస్థితుల్లో కూడా నాసిరకం మందులు కొనుగోలు చేయవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. హెచ్‌ఒడిలకు ఏడాదికి రూ. 2 కోట్లు, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రి సూపరింటెండ్లకు కోటి రూపాయలు ఖర్చు పెట్టడానికి అధికారం ఇచ్చినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలలో పని చేసే వైద్యులకు నగదు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు వారికి సమీప పట్టణాల్లో నివాసం ఉండటానికి వెసులుబాటు కల్పించాలని ఆదేశించారు. పిహెచ్‌సిలకు హెల్త్ మిషన్ ఇస్తున్న నిధులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నెలకు లక్ష రూపాయాలు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి ఆరోగ్యకేంద్రంలో కుక్కకాటుకు, పాముకాటు, తేలుకాటుకు మందులు ఉండాలన్నారు. గత ప్రభుత్వాలు ప్రజా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయన్నారు. ఇక ముందు అలా జరగకూడదనే వైద్యానికి అధికంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్టు ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎంత మంది వైద్యులు అవసరమో అధ్యయనం చేయాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో అందించే సేవల స్థిరీకరణ, బలోపేతం, ఏకీకరణ ఈ మూడు అంశాలపైన దృష్టిసారించాలని ముఖ్యమంత్రి సూచించారు.
chitram..

ప్రజావైద్యంపై ఆ శాఖ ఉన్నతస్థాయ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సిఎం కెసిఆర్