తెలంగాణ

టోల్‌ప్లాజా వద్ద రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతేపల్లి, ఆగస్టు 12: హైదరాబాద్- విజయవాడ 65వ నెంబరు జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్ గ్రామ శివారులో గల జిఎంఆర్ టోల్‌ప్ల్లాజా వద్ద శనివారం వాహనాల రద్దీతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వరుసగా నాలుగురోజుల పాటు సెలవులు రావడంతో హైదరాబాద్‌లో నివాసముంటున్న వారు స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయాణమడంతో ఉదయం నుండి వాహనాల రద్దీ కొనసాగింది. వందలాది కార్లు, బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు విజయవాడ వైపునకు భారీసంఖ్యలో రావడంతో ఊహించని విధంగా టోల్‌ప్లాజా వద్దకు వాహనాలు చేరుకోవడంతో విజయవాడ వైపునకు బారులుతీరి కన్పించాయి. ఉదయం 8 గంటల సమయంలో ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరగడంతో జిఎంఆర్ సిబ్బంది అప్రమత్తమై క్రమబద్ధీకరించేందుకు యత్నించినప్పటికీ నిమిషనిమిషానికి ట్రాఫిక్ పెరుగుతూనే ఉండడంతో వాహనదారులు గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చింది. టోల్‌ప్లాజాలో మొత్తం 12 గేట్లు ఉండగా తొలుత రద్దీని అంచనా వేయలేని సిబ్బంది విజయవాడ వైపు కేవలం నాలుగుగేట్లనే తెరిచి ఉంచారు. వాహనాల సంఖ్య అధికం కావడంతో కిలోమీటర్ పొడువున వాహనాలు నిలిచిపోయి ట్రాఫీక్ జామ్ అయింది. గేట్ల సంఖ్యను పెంచేందుకు సిబ్బంది కొరతగా ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో నాలుగు గేట్లు ద్వారానే ట్రాఫిక్‌ను అనుమతించడంతో వాహనదారులకు తిప్పలు తప్పలేదు. అప్పటికి తెరుకున్న టోల్‌ప్లాజా సిబ్బంది భారీ వాహనాలను అనుమతించకుండా పక్కన నిలిపివేసి కార్లు, బస్సులను మాత్రమే అనుమతించి ట్రాఫిక్ తగ్గిన తర్వాత భారీ వాహనాలు, లారీలను అనుమతించారు. గంటల తరబడి కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయిన పోలీసులు మాత్రం ఆవైపుకు రాకపోవడంతో రక్ష టీమ్ మేనేజర్ పాష ఆధ్వర్యంలోనే జిఎంఆర్ సిబ్బంది ట్రాఫీక్‌ను క్రమబద్ధీకరించారు. మధాహ్నం వరకు రద్దీ కొనసాగి ఆతర్వాత సాధారణ స్థితికి చేరుకుంది. ట్రాఫిక్‌ను అంచనా వేసి తిరుగు ప్రయాణంలోనైనా అధిక గేట్లను తెరిచి తమకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరారు.