తెలంగాణ

ప్రాజెక్టులపై మా ప్రెజంటేషన్ సమగ్రంగా ఉంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటుపై టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని రుజువు చేస్తూ తాము చేసే పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా సమగ్ర సమాచారాన్ని అందిస్తామని టిపిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. గురువారం నాడిక్కడ గాంధీభవన్‌లో పార్టీ సీనియర్ నాయకులతో చర్చించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి సాగునీటి ప్రాజెక్టులపై చెప్పే అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వాస్తవాలు ఏమిటనేది వివరించాలని పార్టీ నేతలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేసే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను అందరూ తిలకించే విధంగా డిసిసి కార్యాలయాల వద్ద పెద్ద పెద్ద తెరలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, టి.జీవన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ఎఐసిసి అధికార ప్రతినిధి మధు యాష్కీ గౌడ్, టిపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, తదితరులతో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చర్చించారు.రైతులకు చెల్లించాల్సిన రుణ మాఫీని ఏక మొత్తంగా చేపట్టాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రుణపరిమితిని పెంచడం ద్వారా ఎక్కువ మొత్తంలో రుణం సమకూరే అవకాశం ఉన్నందున రైతు రుణ మాఫీ ఏక మొత్తంలో చెల్లించాలని కోరారు.