తెలంగాణ

రెండు కోట్ల విలువైన ఎర్రచందనం లారీ పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, ఏప్రిల్ 7: రెండు కోట్ల విలువైన సుమారు ఏడు టన్నుల ఎర్రచందనం దుంగల లారీని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేటలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఏపి 16 టిఎక్స్ 0367 గల లారీలో ఏడు టన్నుల ఎర్రచందనం దుంగలను వేసుకుని, పైన సిమెంట్ బస్తాలను నింపుకుని స్మగ్లర్లు హైదరాబాద్ నగర శివారు నుండి నాగపూర్‌కు తరలిస్తున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు సిఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ నాగార్జున్‌గౌడ్ తమ సిబ్బందితో దామరచెర్వు వద్ద కాపుకాసి లారీని పటుకుని డ్రైవర్, క్లీనర్‌లను అదుపులోకి తీసుకున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో జిల్లా అటవీ అధికారి శ్రీదర్‌రావు, రేంజ్ అధికారి చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఎర్రచందనం సుమారు ఏడు టన్నుల వరకు ఉండొచ్చని అటవీశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.