తెలంగాణ

40వేల పోస్టులు భర్తీ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణలో కొత్త జిల్లాల ప్రకారమే ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సిఎం కెసిఆర్‌ను కోరారు. ఉపాధ్యాయ ఉద్యోగాలు 8972 కాదని 40వేల వరకు ఖాళీలు ఉన్నాయని, వాటన్నింటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం సిఎం కెసిఆర్‌కు ఆయన లేఖ రాశారు. టెట్ ఫలితాలు విడుదల కాగానే ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్న విద్యాశాఖ మంత్రి టెట్ ఫలితాలు ప్రకటించి నెల రోజులైనా ఇంతవరకు నోటిఫికేషన్ జారీ కాలేదని అన్నారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ వాయిదా వేయాలనే సాకులు మానుకుని తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే గత మూడేళ్ల నుంచి ఆరుసార్లు వివిధ కారణాలు చూపుతూ వాయిదాల మీద వాయిదాలు వేశారని గుర్తు చేశారు. ఇప్పుడు తాజాగా పాత జిల్లాల ప్రకారం భర్తీ చేయాలా, కొత్త జిల్లాల ప్రకారం భర్తీ చేయాలా అంటూ సరికొత్త వివాదాన్ని తెరమీదకు తెచ్చారని పేర్కొన్నారు. పాత జిల్లాల ప్రకారం భర్తీ చేస్తే న్యాయపరమైన అంశాలు తెరమీదకు వచ్చే అవకాశం ఉన్నందున కొత్త జిల్లాల ప్రకారమే జిల్లాను యూనిట్‌గా తీసుకుని టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని కృష్ణయ్య సిఎంను కోరారు. టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదని, కొందరు ప్రభుత్వ పెద్దలు ఉపాధ్యాయ సంఘాలపై ఒత్తిడి తెచ్చి రిక్రూట్‌మెంట్ వాయిదా వేసేలా చూస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు సెప్టెంబర్ 13లోగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు. సిఎం స్థాయిలో జోక్యం చేసుకుని 40 వేల టీచర్ల పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.