తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కట్టంగూర్, ఆగస్టు 14: 65వ నెంబర్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం గ్రామశివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కమ్యూనిస్టు యోధుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత మద్దికాయల ఓంకార్ తనయుడు, అతని అత్త అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే ఓంకార్ తనయుడు డాక్టర్ మద్దికాయల విజయ్‌కుమార్, అతని భార్య డాక్టర్ ఝాన్సీలక్ష్మి గత కొనే్నళ్లుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో ప్రైవేటు ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరయ్యేందుకు విజయ్‌కుమార్ దంపతులతో పాటు అతని అత్త సావిత్రమ్మ, పెంపుడు కుమార్తె శోభతో కలిసి కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం శివారులోని గచ్చుగురిచెర్వు కాల్వ వద్ద ముందుగా వెళ్తున్న ఆయిల్‌ట్యాంకర్‌ను అధిగమించే క్రమంగా అదుపుతప్పి ట్యాంకర్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న డాక్టర్ మద్దికాయల విజయ్‌కుమార్ (50), అతని అత్త దాసరాజు సావిత్రి (70) అక్కడిక్కడే మృతి చెందగా అతని భార్య డాక్టర్ ఝాన్సీలక్ష్మి, కుమార్తె శోభకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం గమనించి ఘటనస్థలంలో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. క్షతగాత్రులను నార్కెట్‌పల్లి సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఝాన్సీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కుమార్తె శోభకు కుడికాలు విరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనస్థలాన్ని నకిరేకల్ రూరల్ సిఐ విశ్వప్రసాద్ సందర్శించారు. మృతదేహాలను వైద్యపరీక్షల నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరీక్షల అనంతరం బంధువులకు అప్పగించారు. డాక్టర్ ఝాన్సీలక్ష్మి సోదరుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ బి.రంజిత్ తెలిపారు.