తెలంగాణ

సాగర్ దరిచేరని కృష్ణమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 14: కృష్ణమ్మ పరవళ్లు నారాణయణపూర్, అల్మట్టి ప్రాజెక్టుల వరకే ఆగిపోతుండడంతో తెలంగాణ పరిధిలో ఈ ఏడాది కృష్ణమ్మ సవ్వడుల జాడ కానరాక నాగార్జునసాగర్ రిజర్వాయర్ అడుగంటిపోతూ సాగు, తాగునీటి కటకట రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఆగస్టు నెల గడిచిపోతున్నా సాగర్ దరికి కృష్ణమ్మ రాకపోవడంతో సాగునీటి అవసరాలు పక్కన పడితే కనీసం నల్లగొండ, హైదరాబాద్ వాసులకు తాగునీటికి కూడా సరిపడా నీరందించలేని దుస్థితి నెలకొంది. సాగర్ జలాశయంలో నీటిమట్టం ముందెన్నడూ లేనిరీతిలో 500 టిఎంసిలకు పడిపోగా నల్లగొండ, హైదరాబాద్ వాసులకు తాగునీరందించే ఎఎమ్మార్పీ పుట్టంగండి మోటార్లకు సరిపడా నీరందడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు సాగర్ జలాశయంలో అప్రోచ్ కెనాలను మరింత లోతుకు నీటిలో పొడిగించేందుకు డ్రెడ్జింగ్ పనులు చేపట్టారు. అయితే ఇప్పటికే పూర్తి కావాల్సిన డ్రెడ్జింగ్ పనులు 23 రోజుల నుండి 45 శాతం మాత్రమే పూర్తయ్యాయి. జలాశయంలో నీటిలో డ్రెడ్జింగ్ పనులు సాగిస్తుండగా రాళ్లు అడ్డువస్తుండడంతో దిశలు మార్చుతూ డ్రెడ్జింగ్ నిర్వహిస్తున్నారు. డ్రెడ్జింగ్ పనులు పూర్తయినా రోజురోజుకూ నీటిమట్టం జలాశయంలో మరింత లోతుకు పడిపోతుండడంతో ఎగువ నుండి కృష్ణానీటి విడుదల ఒక్కటే తాగునీటి సమస్యకు పరిష్కారమని ఇరిగేషన్, మెట్రోవాటర్ వర్క్స్ ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు.
కర్నాటక కరుణిస్తేనే!
ప్రస్తుతం ఎఎమ్మార్పీ మోటార్ల ద్వారా 525 క్యూసెక్కులను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో పూర్తి మట్టం 245 అడుగులకుగాను 235 అడుగులుగా ఉంది. డ్రెడ్జింగ్ పనులు ముందుకు సాగకపోతుండడంతో ప్రస్తుతం అప్రోచ్ కెనాల్ ద్వారా ఏఎమ్మార్పీ ఎమర్జన్సీ మోటార్లను పదింటికి ఏడు నడిపిస్తున్నారు. నీరు అందుతున్న మేరకు ప్రధాన మోటార్లు రెండింటిని వంతుల వారీగా నడిపిస్తూ రోజులు నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం ఎకెబిఆర్‌లో అందుబాటులో ఉన్న నీటితో మరో నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌కు నీరందించవచ్చని మెట్రోవాటర్ వర్క్స్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు నల్లగొండ జిల్లాలో 500కి పైగా గ్రామాలకు తాగునీరందించే ఉదయ సముద్రం పూర్తిగా అడుగంటిపోవడంతో ఈ జిల్లా ప్రజాప్రతినిధులు ఎఎమ్మార్పీ నుండి వెంటనే నీటిని విడుదల చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. దీనిపై మంగళవారం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ క్షేత్ర స్థాయిలో నీటి లభ్యతను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే కర్ణాటక నుండి తెలంగాణ ప్రభుత్వం కోరిన 15 టిఎంసిల నీటి విడుదల జరుగని పక్షంలో తాగునీటి మోటార్లకు సరిపడ నీరందని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం కోరిన 15 టిఎంసిల నీటి విడుదల విషయమై కర్ణాటక ప్రభుత్వం తాత్సర్యం మరింత ఆందోళనకరంగా మారింది.