తెలంగాణ

విద్యాసంస్థల్లో ఖాళీల భర్తీ బాధ్యత పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: తెలంగాణలో వివిధ విద్యాసంస్థల్లో ఖాళీల భర్తీ బాధ్యతను ప్రభుత్వం పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు అప్పగించనుంది. ఐదు విభాగాల్లో ఉన్న 2444 పోస్టులను భర్తీ చేసేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఎస్సీ సంక్షేమ శాఖలో 12 ప్రిన్సిపాల్ పోస్టులు, 560 టిజిటిలు, 79 పిఇటిలు, 52 ఆర్టు/మ్యూజిక్ టీచర్లు, మూడు క్రాఫ్ట్ టీచర్లు, 34 లైబ్రరియన్లు, 18 స్ట్ఫా నర్సు పోస్టులు భర్తీ చేస్తారు. పాఠశాల విద్య ఆధ్వర్యంలో ఆరు జూనియర్ లెక్చరర్ పోస్టులు, 136 పిజిటిలు, 74 టిజిటిలు, 22 పిఇటిలు , 43 ఆర్టు/క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, 32 నర్సు పోస్టులు భర్తీ చేస్తారు. బిసి సంక్షేమ శాఖ గురుకులాల్లో ఏడు ప్రిన్సిపాల్ పోస్టులు, 83 పిజిటిలు, 99 టిజిటిలు, 16 పిఇటిలు, 28 ఆర్టు టీచర్లు,16 స్ట్ఫా నర్సులు, 22 జూనియర్ లెక్చరర్లు, 36 డిగ్రీకాలేజీ లెక్చరర్ పోస్టులు భర్తీ చేస్తారు. ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలకు 41 జూనియర్ లెక్చరర్లు, 26 లైబ్రరియన్లు, 40 పిజిటిలు, 271 టిజిటి పోస్టులు భర్తీ చేస్తారు.