తెలంగాణ

రాష్ట్ర పోలీసుల పనితీరు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 14: దేశంలోనే తెలంగాణ పోలీసుల పనితీరు భేష్‌గా ఉందని, ఇది తాను ఇస్తున్న కితాబు కాదని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బహిరంగంగా తెలిపారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాలలో ఆయన పర్యటించారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో గల కొత్తకోట, మదనాపురం మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తిరుమలయపల్లి గ్రామంలోదివంగత ప్రొఫెసర్ జయశంకర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా రాణిపేటలో రాజాబహదూర్ విగ్రహాన్ని కూడా అవిష్కరించారు. కొత్తకోటలో 33/11 కెవి సబ్‌స్టేషన్ నిర్మాణంతో పాటు మధనాపురం మండల కేంద్రంలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించే బిటిరోడ్డు పనులకు హోంమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హోంమంత్రి మాట్లాడుతూ శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అందుకే తెలంగాణ పోలీసులు శాంతిభద్రతల విషయంలో ఎక్కడ కూడా రాజీపడడం లేదన్నారు. వ్యవస్థ అయినప్పుడు కొన్ని లోటుపాట్లు ఉంటాయని, వాటిని సరిచేసుకుంటూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసు శాఖ పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం నిర్ణయం రాష్ట్రంలో ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని తెలిపారు. పోలీస్‌స్టేషన్లకు ఫిర్యాదులు వస్తే ఇకమీదట ఆన్‌లైన్‌లో ఉంచుతామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలలో కూడా ప్రతి ఫిర్యాదును చూసుకునే అవకాశం ఉందని, డిజిపి కూడా ఫిర్యాదులపై ఆన్‌లైన్‌లో పర్యవేక్షించనున్నారన్నారు. రాష్ట్రంలో ఆరాచకశక్తులకు తావు లేదని శాంతికి భంగం కలిగిస్తూ ప్రజల జీవన విధానానికి ఇబ్బందులు పెట్టే వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. ఇప్పటికే కొందరి సంగతిని తెలంగాణ పోలీసులు తెల్చేశారని భవిష్యత్తులో సమాజానికి కీడు కలిగించేవారు తెలంగాణ గడ్డపై ఉండడానికి వీలు లేకుండా తెలంగాణ పోలీసులు ముందుకు వెళ్తున్నారని తెలిపారు. 1969 తెలంగాణ ఉద్యమంలో దివంగత ప్రొఫెసర్ జయశంకర్‌తో కలిసి తాను కూడా అప్పటి ఉద్యమంలో పాల్గొన్నానని జయశంకర్ ఆశయ సాధన కోసం అందరం కృషి చేయాలని కోరారు. వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మాణం చేయడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న కృషి ఆమోఘమని ఆయనకు ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపి జితేందర్‌రెడ్డి, ప్రణాళికా సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. తిరుమలయపల్లిలో ఆచార్య జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి నాయిని