తెలంగాణ

మత్స్య శాఖ అభివృద్ధికి వెయ్యి కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఆగస్టు 15 : గత ప్రభుత్వాల హామీలతో నిర్లక్ష్యానికి గురై కుదేలైన మత్స్య శాఖను బలోపేతానికి తెలంగాణ సర్కారు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట కోమటిచెరువు వద్ద మత్స్యశాఖ ఏర్పాటు చేసిన మత్స్యకారుల అవగాహన సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల దశ, దిశ మారిందని, రాష్ట్రం ఏర్పాటు వల్లనే సాధ్యమైందన్నారు. మత్స్యపరిశ్రమ అంటే ఆంధ్ర పరిశ్రమగానే గుర్తించి మత్స్య శాఖకు ఎలాంటి తోడ్పాటు అందించలేదన్నారు. లక్షలాది మందికి జీవనోపాధి కల్పించే పరిశ్రమగా ముఖ్యమంత్రి కెసిఆర్ గుర్తించారన్నారు. మత్స్యశాఖపై ఒకరోజు సమగ్రంగా కెసిఆర్ చర్చించారన్నారు. రాష్ట్రంలోని అన్ని చెరువుల సామర్థ్యం పరిమా ణం బట్టి ఎన్ని చేపపిల్లలు పడితే అన్నింటికీ వంద శాతం ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈఏడాది రాష్ట్రంలో 74 కోట్లు చేపపిల్లలు ఉచితంగా చెరువుల్లో పోయనున్నట్లు తెలిపారు. సిఎం కెసిఆర్ పెద్ద మనస్సుతో నిర్ణయించి చెరువులు, కుం టులు, చెక్ డ్యాంల్లో చేప పిల్లలు ఉచితంగా వేయనున్నట్లు పేర్కొన్నారు. గతంలో దళారుల దగ్గర అడ్వాన్స్ తీసుకొని డబ్బులు లేక దళారులకు అమ్ముకోవాల్సి వచ్చేదని, సొంతంగా మార్కెటింగ్ చేసి తన కాళ్లపై తాను నిలబడాలన్నారు. వందశాతం ఉచితంగా చేప పిల్లలను ఇస్తున్నట్లు, 75 శాతం సబ్సిడీతో ప్యాడీ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. 25 లక్షల రూపాయలతో ఐస్ ఫ్యాక్టరీలు పెట్టుకుంటే 5 లక్షలు కడితే 20 లక్షలు సబ్సిడీగా వలలు, తెప్ప లు, ఐదు వేలు కడితే 15 వేలు ప్రభుత్వం కట్టి 20 వేలు విలువ గల అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. సబ్సిడీపై మోపె డ్లు, ఆటోలు అందచేయనున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేటలో 2.50 కోట్లతో హోల్‌సెల్, రిటైల్ మార్కెట్ నిర్మాణం కోసం కేటాయించినట్లు తెలిపారు. మహిళా మత్య్సకారుల సంఘాలు పటిష్టం చేసేందుకు 75 వేల నుండి 2 లక్షల వరకు రుణాలు పెంచినట్లు పేర్కొన్నారు. మత్స్యకారులు ప్రమాదవశాత్తు మృతి చెందితే 4 లక్షలు పెంచి 6 లక్షలు ఎక్స్‌గ్రెషియా చెల్లించాలని నిర్ణయం తీసుకుందన్నారు. మత్స్యశాఖను బలోపేతం చేసేలా సిబ్బంది నియామకం, కరీంనగర్, మహబూబునగర్ విద్యార్థులు విద్యను అభ్యసించేలా రెండు మత్య్స కళాశాలలు మంజూరు చేసినట్లు పేర్కొన్నా రు. సంపద పెరిగితే ఆదాయం పెరుగుతుందని, చేప విత్తనం ఆంధ్ర రాష్ట్రం నుండి తెచ్చి నష్టపోతున్నామన్నారు. సీడ్ విత్తనం తయారు చేసుకునేలా విత్తన అభివృద్ధి కేంద్రాలను నిజాంసాగర్, కడేం ప్రాజెక్టు, సింగూర్‌లో ఏర్పాటు చేసి నాణ్యమైన సీడ్ తయారు చేసి అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.