తెలంగాణ

చిన్న జిల్లాలతోనే రాష్ట్రం అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఆగస్టు 15: తెలంగాణలోప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చిన్న జిల్లాలను ఏర్పాటు చేశారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మంగళవారం 71వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని జిల్లా పరేడ్ గ్రౌండ్‌లో మువ్వనె్నల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం మంత్రి ప్రసంగించారు. గత పాలకులు చేయని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు సిఎం కెసిఆర్ స్వరాష్ట్రంలో అమలు చేసి తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా అహర్నిశలు కృషి చేస్తున్నారని, సామాన్యులకు కూడా న్యాయం జరిగేలా పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లా ల ఏర్పాటు చేశారని, రెండు నదు ల మద్య ఉన్న నడిగడ్డను జోగుళాంబ గద్వాల జిల్లాగా ఏర్పాటు చేసి ఈ రోజు అభివృద్ధి రంగంలో జిల్లా ఉన్నతాధికారులు అందుబాటులో ఉండటం వల్ల జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. వృద్ధ్యా ప్య, వికలాంగుల పెన్షన్‌తో పాటు, ఒంటరి మహిళల ఆస రా పథకం, ఎస్సీ, ఎస్టీ, బిసిల కోసం కల్యాణలక్ష్మి, ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు, విదేశీ విద్యకోసం ఓవర్సీస్ రుణాలు, చేతివృత్తుల వారికోసం రుణాలు, వ్యవసాయ రుణాలు, పారిశ్రామిక రంగా న్ని ప్రోత్సహించడానికి టిఎస్‌ఐపాస్ అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. గ్రామాలలో మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకు డు గుంతలు నిర్మాణం, గ్రామ సంఘాలలో పని చేసే విఏసి లకు గౌరవ వేతనం ఇస్తున్నామని, భూగర్భ జలాలు పెంచే ఉద్దేశ్యంతో జలనిధి కార్యక్రమం ద్వారా ఫారంపాం డ్స్, డగౌట్ పౌండ్స్, ఊటకుంటలు, పాత బావుల పూడిక పనులను చేపట్టామన్నారు. రైతు రుణమాఫీ, దళారీ వ్య వస్థ రూపుమాపడానికి వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిశామని, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖలో సూక్ష్మ సేద్య పథకం కిందా రాయితీతో కూడినడ్రిప్, స్ప్రింక్లర్లు అందజేసినట్లు తెలిపారు.
ఇల్లులేని నిరుపేదలకు డబుల్‌బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని, చేనేత, జౌళి శాఖ ద్వారా చేనేత కార్మికులకు రుణసౌకర్యం కల్పించామని అన్నారు. ప్రతి నిరుపేద మహిళ కాన్పు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పు జరిగేలా కేసిఆర్ కిట్టు పథకాన్ని ప్రారంభించారని, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు తీర్చిదిదుతున్నామని, తెలంగాణలోనే జిల్లా అక్షరాస్యతలో వెనుకబడి ఉం దని, అక్షరాస్యత పెంచడానికి అక్షరభోదిని కార్యక్రమం ప్రారంభించారని, వయోజన విద్యశాఖ ద్వారా జిల్లాను అక్షరాస్యతలో ముందుంచడానికి జిల్లా అధికారులు అన్ని విధాల కృషి చేస్తున్నారని, ప్రతి సంక్షేమ పథకం అర్హులకు అందేలా ప్రభుత్వ అధికారులు కృషి చేసి బంగారు తెలంగాణను రూపొందించాలని జిల్లా ప్రభుత్వ అధికారులకు సూచించారు.