తెలంగాణ

సూర్యాపేటలో ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఆగస్టు 15: సూర్యాపేట జిల్లా కేంద్రంలో పబ్లిక్ క్లబ్ కార్యవర్గం ఎన్నికల సందర్భంగా అధికార టిఆర్‌ఎస్, విపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య చెలరేగిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారిం ది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పబ్లిక్‌క్లబ్ లో జెండా ఆవిష్కరణ జరిపేందుకు ఇరువర్గాల వా రు ఏర్పాట్లు చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిస్థితుల్లో మంగళవారం కొత్త బస్టాండ్ వద్ద పబ్లిక్ క్లబ్ మాజీ కార్యదర్శి, కాంగ్రెస్ నాయకుడు కొప్పు ల వేణారెడ్డితో పాటు మరి కొంతమంది కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం వివాదానికి దారితీసిం ది. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నాయకులను మేళ్లచెర్వు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇంతలో పబ్లిక్‌క్లబ్‌లో ఫైమెన్ కమిటీ సభ్యులు కట్కూరి గన్నారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. పట్ట ణ కాంగ్రెస్ కార్యాలయంలో స్వాతం త్య్ర దినోత్సవ వేడుకల్లో ఉన్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఈ విష యం తెలుసుకొని అక్కడి నుండి కాలినడకన ఎంజి రోడ్డులో గల గాంధీ విగ్ర హం వద్దకు చేరుకొని నిరసన దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భం గా దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. పబ్లిక్‌క్లబ్ అంశాన్ని అధికార పార్టీ నేతలు వివాదాస్పదం చేసి అరెస్టుకు పాల్పడడం పట్ల మం డిపడ్డారు. అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేసే వరకు దీక్ష విరమించేది లేదని భీష్మించారు. ఇంత లో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి అక్కడికి చేరుకొని దీక్షకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం రోజున కాంగ్రెస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దామోదర్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆందోళన చేస్తున్న దామోదర్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు డిఎస్పీ సునీతామోహన్ ఆధ్వర్యంలో పోలీస్ బలగా లు భారీసంఖ్యలో గాంధీ విగ్రహం వద్ద కు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నించిన క్రమంలో తోపులాట జరిగి ఉత్కంఠ నెలకొంది. చివరికి పోలీసులు దామోదర్‌రెడ్డిని అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కించే క్రమంలో ఆయన సొమ్మసిల్లి పడిపోవడంతో చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దామోదర్‌రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. ఆసుపత్రిలో ఎమ్మెల్యే పద్మావతి దామోదర్‌రెడ్డిని పరామర్శించి అరెస్ట్‌ను ఖండించారు. దామోదర్‌రెడ్డిని పరీక్షించిన వైద్యుల సలహామేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మొత్తంగా స్వాతంత్య్ర దినోత్సవ రోజున కాంగ్రెస్ నేతల అరెస్ట్‌తో జిల్లా కేంద్రంలో ఉదయం నుండి మధ్యా హ్నం వరకు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

చిత్రాలు.. కాంగ్రెస్ నాయకుల అరెస్ట్‌కు నిరసనగా గాంధీ విగ్రహం ముందు నిరసన దీక్ష చేస్తున్న ఆర్డీఆర్..
అరెస్ట్ సందర్భంగా సొమ్మసిల్లి పడిపోయిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి